Cobra Twitter Review: విక్రమ్‌ గెటప్‌ల సినిమా ‘కోబ్రా’ గురించి ట్విటర్‌ ఏమంటోందంటే?

విక్రమ్‌ సినిమా వెరైటీగా ఉంది అని అన్నాం అంటే.. పంచదార తియ్యగుంది అని కొత్తగా చెప్పినట్లే. ఎందుకంటే వెరైటీగా లేకపోతే విక్రమ్‌ ఆ సినిమానే ఒప్పుకోరు. తన నటనలో మరో కోణం ఆవిష్కరించడమే లక్ష్యంగా ఆయన సినిమాలు చేస్తూ ఉంటారు. తాజాగా అలా ఆయన చేసిన మరో ప్రయత్నం ‘కోబ్రా’. విక్రమ్‌ సుమారు 25 గెటప్‌లు/పాత్రలు వేశాడు అని చెబుతున్న ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. దీంతో ట్విటర్‌లో ఈ సినిమా గురించే సందడి కనిపిస్తోంది.

విక్రమ్‌ సరసన ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి, మీనాక్షి గోవిందరాజన్ కథానాయికలు. భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఈ చిత్రంతో నటుడిగా తెరంగేట్రం చేస్తున్నాడు. ‘కోబ్రా’ బడ్జెట్‌ రూ. 90 కోట్లకుపైమాటే అంటున్నారు. విక్రమ్‌ రూ. 25 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్లు టాక్‌. ‘డిమోంటీ కాలనీ’, ‘అంజలి సి.బి.ఐ’ లాంటి వైవిధ్యమైన సినిమాలు తీసిన దర్శకుడు ఆర్‌. అజయ్‌ జ్ఞానముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇక ప్రీమియర్ షోలు చూసిన ఫ్యాన్స్ ఏమంటున్నారు? ట్విట్టర్‌లో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? అనేది ఓ లుక్కేద్దాం.. సినిమాలో విక్రమ్‌ ఎంట్రీ సీన్స్‌, గెటప్స్‌ అదిరిపోయాయని టాక్‌ వినిపిస్తోంది. ఎప్పటిలాగే ఏఆర్‌ రెహ్మాన్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ వండర్‌ఫుల్‌ అని కామెంట్స్‌ కనిపిస్తున్నాయి. ఫస్టాఫ్‌ చూసిన అభిమానులు అయితే విక్రమ్‌ ఈజ్‌ బ్యాక్‌, సెకండాఫ్‌ కోసం వెయిటింగ్‌ అని కామెంట్స్‌ రాస్తున్నారు. విక్రమ్‌ నటన కోసం థియేటర్లకు రావాల్సిందే అని అంటున్నారు.

దర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తు పనితనంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ముగ్గురు నాయికలు ముఖ్యంగా శ్రీనిధి శెట్టి గ్లామర్‌, నటనకు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా బాగా చేశాడు అని కొందరు క్రికెట్‌ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ ట్విటర్‌లో రాసుకొస్తున్నారు. విక్రమ్‌ గెటప్‌ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదంతా చూస్తుంట సెకండాఫ్‌ కూడా అదిరిపోతే ‘కోబ్రా’తో విక్రమ్‌ మంచి హిట్‌ కొట్టే అవకాశం ఉంది అనిపిస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus