Ram Charan,Upasana: వారి మధ్య గొడవకు కారణం అదేనా..!

సినిమా ఇండస్ట్రీ లో ఈమధ్య స్టార్ సెలెబ్రిటీలు ఎంత తొందరగా అయితే పెళ్లి చేసుకుంటున్నారో, అంతే తొందరగా విడిపోతున్నారు కూడా. ఇలాంటి రోజుల్లో కూడా ఆదర్శంగా నిలిచే జంటలు మన టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. ఆ జంటలలో ఒకటి రామ్ చరణ్ – ఉపాసన. వీళ్లిద్దరికీ పెళ్లి జరిగి 11 సంవత్సరాలు పిల్లలు పుట్టకపోయిన, చుట్టూ పక్కన ఉండేవాళ్ళు, సోషల్ మీడియా లో ఉండే నెటిజెన్స్, అభిమానులు ఇలా ఎంతో మంది ఎన్నో విధాలుగా అనుకున్నా కూడా, ఏమాత్రం ఖాతరు చెయ్యకుండా సంసార జీవితం ని కొనసాగించి, ఆదర్శ దంపతులు అంటే ఇలా ఉండాలి అని అనిపించారు.

రీసెంట్ గానే ఈ క్యూట్ కపుల్ కి ‘క్లిన్ కారా’ అనే పాప పుట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పాప జన్మించిన రోజు మెగా కుటుంబం లో మరియు మెగా అభిమానుల్లో ఎంత సంతోషం కురిసిందో మనమంతా చూసాము. అయితే ఇన్నేళ్ల వీళ్లిద్దరి దాంపత్య జీవితం లో ఎప్పుడూ ఎదురు అవ్వని విబేధాలు రీసెంట్ గా వరుణ్ తేజ్ పెళ్లి కోసం స్పెయిన్ కి వెళ్ళినప్పుడు ఒక గిఫ్ట్ విషయం లో విబేధాలు వచ్చాయట.

ఉపాసన కోసం పాపం చరణ్ ఊరు మొత్తం తిరిగి ఒక విలువైన వాచ్ ని కొనుకోలు చేసి ఆమెకి బహుమతిగా ఇచ్చాడట. రామ్ చరణ్ కి తిరిగి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు చెప్పాల్సింది పోయి, ఈ వాచ్ అసలు ఏమి బాగాలేదు, ఎక్కడ తెచ్చావు ఇది అని రామ్ చరణ్ తో అనింది అట.

అంతే కాదు ఆ వాచ్ ధర ని చూసి కూడా (Ram Charan) రామ్ చరణ్ కి ఉపాసన చేతిలో చివాట్లు పడినట్టు తెలుస్తుంది. ఇంత డబ్బులు ఇలాంటి చెత్తని కొనడానికి వేస్ట్ చేసావా అంటూ రామ్ చరణ్ పై విరుచుకుపడి ఆ గిఫ్ట్ ని రిజెక్ట్ చేసిందట. దీనికి రామ్ చరణ్ బాగా హర్ట్ అయ్యినట్టు సమాచారం.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus