Revanth, Adi Reddy: రేవంత్ కి ఫుల్ క్లాస్ పీకీన ఆదిరెడ్డి..! టాస్క్ లో జరిగింది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో ఈవారం కెప్టెన్సీ పోటీదారులు అయ్యేందుకు బిగ్ బాస్ మిషన్ ఇంపాజబుల్ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో రెడ్ టీమ్ , బ్లూటీమ్స్ గా విడిపోయారు హౌస్ మేట్స్. ఆదిరెడ్డి, బాలాదిత్య, ఇనయ, రాజ్, రోహిత్, వాసంతీ, మెరీనా బ్లూటీమ్ లో ఉన్నారు. రెడ్ టీమ్ లో గీతు, రేవంత్, శ్రీసత్య, శ్రీహాన్, కీర్తి, ఫైమా ఉన్నారు. ఇక్కడే ఇద్దరి మద్యలో టాస్క్ స్టార్ట్ అవ్వగానే పెద్ద యుద్ధమే జరిగింది. ఒకరి భుజంపై ఉన్న స్ట్రిప్స్ ని ఇంకొకరు లాక్కునే ప్రయత్నం చేశారు.

గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన విమానం నుంచీ గ్రానైట్ పడుతుంది. దాన్ని దక్కించుకున్నవారు ఛాలెంజ్ ని ఎదుర్కుంటారు. ఈ ఛాలెంజ్ లో భాగంగా రెండు టీమ్స్ పోటీపడాతాయి. అంతేకాదు, భుజంపై ఉన్న నాలుగు స్ట్రిప్స్ ని లాగేస్తే ఆ హౌస్ మేట్ చనిపోతాడు. చనిపోయిన హౌస్ మేట్ మళ్లీ టాస్క్ లో స్ట్రిప్స్ ని లాగేందుకు ప్రయత్నించకూడదు. ఇక్కడి వరకూ రూల్స్ బాగానే ఉన్నాయి కానీ, ఆటలో దిగాక ఇది వేరే రూల్ గా మారిపోయింది. ఇక్కడే రెడ్ టీమ్ కి, బ్లూటీమ్ కి మద్యలో ఫైట్ జరిగింది.

ఒకరి భుజంపై ఉన్న స్ట్రిప్స్ ని ఇంకొకరు లాక్కునేందుకు కలయబడ్డారు. రెడ్ టీమ్ లో ఉన్న రేవంత్ భుజంపై ఉన్న స్ట్రిప్స్ ని బలంగా లాగాడు ఆదిరెడ్డి. దీంతో ఆదిరెడ్డి గోళ్లు రేవంత్ కి గీసుకున్నాయి. అంతే, ఒక్కసారిగా కొడకా.. అంటూ రెచ్చిపోయాడు. కొడకా..ఏంటి.. కొడకా ఏంటి అంటూ ఆదిరెడ్డి రేవంత్ పై ఫైర్ అయ్యాడు. కొడకా అనేది బూతుకాదని ఫస్ట్ చెప్పిన రేవంత్ ఆ తర్వాత దానికి ముందు, వెనక ఏం జోడించలేదని చెప్పాడు.

దీనికి ఆదిరెడ్డి సీరియస్ గా రేవంత్ కి వార్నింగ్ ఇచ్చాడు. బ్రో అనేసి అనలేదని చెప్పొద్దని, ఆ మాట కరెక్ట్ కాదని అన్నాడు. నువ్వు కూడా బొక్కలే అన్నావ్ కదా అని రేవంత్ దబాయించాడు. అది వేరు బ్రో, ఇది వేరు బ్రో ఏం మాట్లాడుతున్నావ్ అంటూ రేవంత్ కి తర్వాత కూల్ గా నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు ఆదిరెడ్డి. టాస్క్ లో రేవంత్ నిజానికి నోరుజారాడు. కానీ, కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు.

ఫైనల్ గా ఆదిరెడ్డితో ఉన్న మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ వల్ల ఇద్దరూ మళ్లీ కలిసిపోయారు. ఏది ఏమైనా టాస్క్ లపుడు రేవంత్ నోరుజారడం అనేది కామన్ అయిపోయింది. అలాగే, గీతు కూడా ఎదుటివాళ్ల వీక్ నెస్ ని దెబ్బకొట్టి గేమ్ గెలవాలని ఫిక్స్ అయ్యింది. అందుకే ఈటాస్క్ లో బాలాదిత్య సిగరెట్స్ దాచేసింది. దీంతో బాలాదిత్య బరెస్ట్ అయి ఎమోషనల్ అయ్యాడు. ఇక ఈటాస్క్ లో ఛాలెంజస్ ఆడి ఎవరు విన్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus