తొలి స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపుదిద్దుకోనున్న సైరా నరసింహా రెడ్డి ఆగస్టులోనే లాంఛనంగా ప్రారంభమయింది. నెక్స్ట్ మంత్ సినిమా సెట్స్ మీదకు వెళుతుందంటే ప్రతినెలా పోస్ట్ పోన్ అవుతోంది. కారణం ఏంటని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయనున్నారు. ఈ కథని పరుచూరి బ్రదర్స్ రాసారు. వారి ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. అయితే డైరక్టర్, రచయితల మధ్య కథ విషయంలో గొడవలు వచ్చాయంట.
ఇలా ఉంటే బాగుంటుందని ఒకరికొకరు సొంత కథలను రెడీ చేసారని ఫిలిం నగర్ వాసుల సమాచారం. తమ కథ ఫైనల్ కావాలని పోటీపడుతున్నారంట. ఈ గొడవ చిరంజీవి వద్దకు వెళ్లగా.. ఆయన నలుగురిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట అనుకున్న కథకు చిన్న మార్పులు మాత్రమే చేయమని, సొంత సీన్లు యాడ్ చేయవద్దని వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ నెలాఖరులోపున స్క్రిప్ట్ ని లాక్ చేయనున్నారు. డిసెంబర్ 6 నుండి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళడానికి అంతా సిద్ధం చేశారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, నయన తార తదితరులు నటిస్తున్న ఈ చిత్రంపై క్రేజ్ మామూలుగా లేదు.