ఒకప్పుడు మా సినిమా వంద రోజులు ఆడింది, ఆడియో సేల్స్ బాగా సేల్ అయ్యాయి, ఎక్కువ సెంటర్స్ లో ఆడింది… ఇలా అప్పట్లో రికార్డుల గురించి గొప్పగా చెప్పుకునే వారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియా పెరిగిన తరువాత ‘మా హీరో బర్త్ డే ట్యాగ్ ట్రెండ్ కి ట్విట్టర్ లో ఎక్కువ ట్వీట్స్ వచ్చాయి. మా హీరో సినిమా టీజర్, ట్రైలర్ లకు రికార్డు వ్యూస్, లైక్స్ వచ్చాయి. అంతేకాదు మా హీరో లిరికల్ పాటకి ఏకంగా 1 మిలియన్ లైక్స్ వచ్చాయి’ ఇలా రక రకాలుగా డబ్బా కొట్టుకుంటూ.. ఒకరిని ఒకరు ట్రోల్ చేసుకుంటున్నారు.
2020 సంక్రాంతికి విడుదల కాబోతున్న రెండు పెద్ద హీరోల సినిమాలకి ఇవే గొడవలు. ప్రమోషన్ చేయడానికి భయపడ్డారు అంటూ ఓ చిత్రం నిర్మాతలు పోటీ చిత్రం పై నెగిటివిటీ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఒకళ్ళు కామెంట్ చేస్తుంటే.., మరొకరు డబ్బులిచ్చి టీజర్ కు లైక్స్ కొట్టించుకున్నారంటూ మరొకరు కామెంట్స్ చేస్తూ ఒకరిని ఒకరు ట్రోల్ చేసుకుంటున్నారు. జియో వంటి నెట్ వర్క్ లు వచ్చాక అందరికీ ఇంటర్నెట్ హై స్పీడ్ తో ఉంటుంది. కాబట్టి ఫోన్ లోనే వాటిని చూసే సదుపాయం ఉంది కాబట్టి.. ఎక్కువ వ్యూస్, రికార్డులు వచ్చే అవకాశం ఉండనే ఉంది. ఆ మాత్రం దానికి ఈ రికార్డులు ఎందుకు పనికొస్తాయి. యూట్యూబ్ లోనూ, ట్విట్టర్ పేస్ బుక్ వంటి వాటిలో రికార్డులు వచ్చినంత మాత్రాన సినిమాలు హిట్ అయిపోయినట్టేనా.. నిర్మాతకి కలెక్షన్లు వచ్చినట్టేనా..? అందరూ ఇదొక సారి గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పండక్కి అన్ని సినిమాలు చూస్తారు.. బాగున్నా సినిమాకి కలెక్షన్లు ఎక్కువ వస్తాయి.. ప్రమోషన్ చేసుకుంటే సరిపోయేదానికి ట్రోలింగ్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుంది అనే కామెంట్స్ కూడా వినిపిస్తూనే ఉన్నాయి.
“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!