Swathi: స్వాతి గురించి అలాంటి కామెంట్ చేసిన నవీన్ చంద్ర.. ఎమోషనల్ అయినా నటి!

Advertisement

నవీన్ చంద్ర కలర్స్ స్వాతి జంటగా మంత్ ఆఫ్ మధు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా అక్టోబర్ ఆరవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఓ ప్రెస్ మీట్ కార్యక్రమానికి చిత్ర బృందం హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నవీన్ చంద్ర కలర్ స్వాతి (Swathi) గురించి మాట్లాడటంతో ఒక్కసారిగా ఆమె ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా నవీన్ చంద్ర మాట్లాడుతూ ఈ సినిమాలో లేఖ అనే ఒక పవర్ ఫుల్ పాత్రలో గడుసు అమ్మాయిగా స్వాతి కనిపిస్తుందని తెలిపారు. ఇక నా చెల్లి ఒక ఉద్యోగం చేస్తుంది ఆమె కుటుంబ బాధ్యతలు అన్నింటిని మోస్తూ ప్రతిరోజు ఆటో బస్సు మెట్రోలలో ప్రయాణం చేస్తూ ఎంతో కష్టపడుతూ ఉంటుందని కలర్స్ స్వాతి కూడా అలాగే ఎంతో కష్టపడుతూ పనిచేస్తూ ఉంటారని తెలిపారు.

ఈమె హార్డ్ వర్కర్ మాత్రమే కాకుండా తనతో పాటు పని చేసే వారికి కూడా ఎంతో నమ్మకాన్ని కలిగిస్తుందని ఈయన స్వాతి గురించి ఎంతో గొప్పగా చెప్పారు. అందుకే తను ఎప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అని బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే కాదు మంచి ఫ్యామిలీ మెంబర్ అని కూడా ఈయన చేసినటువంటి కామెంట్స్ కు స్వాతి ఎమోషనల్ అయ్యారు. ఇంతకన్నా ఆ దేవుడిని నేను ఏమీ అడగనని మా ఇద్దరి జంట నటన మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఈయన తెలిపారు.

ఇక కలర్స్ స్వాతితో కలిసి తాను ఇదివరకే త్రిపుర సినిమాలో నటించాను మరోసారి మీ ముందుకు రాబోతున్నాను ఇకపై తనతో చేసే అవకాశాలు వచ్చిన తప్పకుండా నటిస్తాను అంటూ ఈ సందర్భంగా నవీన్ చంద్ర చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక చాలా రోజుల తర్వాత నవీన్ చంద్ర స్వాతి ఇద్దరు కూడా ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా ద్వారా వీరిద్దరూ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus