గాయకుడైన కమెడియన్ ఆలీ!

మన టాలీవుడ్ లో ఇప్పటిదాకా హీరోలు పాటలు పాడి తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు.వీళ్ళ ఎఫెక్ట్ ఏమో కమెడియన్ లు కూడా మేము ఏమి తక్కువ తినలేదు మాకు పాటలు పాడే టాలెంట్ ఉంది అని నిరూపించుకుంటున్నారు. ‘లచ్చిం దేవికి ఒక లెక్కుంది’ సినిమా లో జయప్రకాశ్ నారాయణ పాటపాడి అందర్నీ ఆశ్చర్య పరిస్తే ఈ సారి ఆలీ ఆ రూట్లోకి చేరుకున్నాడు.కాట్రవెల్లి, ఎంద చాట, అనే వింత పదాలను ఇండస్ట్రీ లోకి పరిచయం చేసిన ఈ చాట తను పాటలు కూడా పాడగలనని నిరూపించుకున్నాడు. వివరాలలోకి వెళితే……
అక్కినేని ఫిలిం స్కూల్ విద్యార్ధి, అసిస్టెంట్ డైరెక్టర్ చునియా దర్శకత్వం వహిస్తున్న ‘పడేసావే’ సినిమాలో అలీ ఒక వింత పాట పాడాడు.వింత బాషలో ఉన్న ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలలో, ఆశ్చర్యం తో పాటు నవ్వులు కురిపిస్తుంది.ఈ సినిమా సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఆలీ గారైతే ఈ పాట మరి కామెడీ గా ఉంటుందని రికమెండ్ చేసి ఆలీ తో పాడించారు అని ఆ చిత్ర యూనిట్ తెలిపింది. మొత్తానికి ఆలీ చిత్రమైన డైలోగ్స్ మాత్రమే కాదు చిత్రమైన పాటలు కూడా పాడగలను అని నిరూపించుకున్నాడు. అయితే ఈసినిమా ఈ నెల 26 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus