లిటిల్ హార్ట్స్ కార్యక్రమానికి యాంకర్ గా మారిన ఆది?

  • November 11, 2022 / 09:30 PM IST

బుల్లితెర పై ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి హైపర్ ఆది కామెడీ టైమింగ్స్ ద్వారా అందరిని ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా ఏందో మంచి గుర్తింపు పొందిన ఈయన ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాల ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.ఇలా అన్ని కార్యక్రమాలలోనూ కమెడియన్ గా తనదైన శైలిలో సందడి చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన ఆది మరో సరికొత్త షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

శ్రీదేవి డ్రామా కంపెనీ నిర్వహిస్తున్నటువంటి టీం లిటిల్ హార్ట్స్ అనే సరికొత్త కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ కార్యక్రమం చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 14వ తేదీ సాయంత్రం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల చేయడంతో ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది టీవీ నటీనటులు వారి పిల్లలతో కలిసి పెద్ద ఎత్తున వేదికపై పోటీపడుతూ ఆటల పాటలతో సందడి చేశారు.

ఇకపోతే ఈ కార్యక్రమానికి మాత్రం యాంకర్ గా హైపర్ ఆది వ్యవహరించడం విశేషం. ఇలా సరికొత్త కార్యక్రమానికి హైపర్ ఆది వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో ఈ కార్యక్రమం పై మరిన్ని అంచనాలు పెరిగాయి.ఇదివరకే ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది సైతం లిటిల్ హార్ట్స్అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ కార్యక్రమం ద్వారా యాంకర్ గా ఆది ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటారో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus