పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డ ‘జోష్’ రవి.!

ఈరోజు ఏంటో చాలా ఘోరమైన వార్తలు వినాల్సి వస్తుంది. జనవరి 27, 2023.. సినీ పరిశ్రమకు ఓ బ్లాక్ డే గా డిక్లేర్ చేసినా ఆశ్చర్యం లేదు అనిపిస్తుంది. ఉదయానే అలనాటి స్టార్ హీరోయిన్ జమున గారు మరణించిన సంగతి తెలిసిందే. ఆ షాక్ నుండి ఇంకా కోలుకోక ముందే ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన శ్రీనివాస మూర్తి మరణించిన వార్త బయటకు వచ్చింది. ఈయన రాజశేఖర్, సూర్య, అజిత్, విక్రమ్, మోహన్ లాల్, జయరాం వంటి స్టార్లకు తెలుగులో డబ్బింగ్ చెప్పేవారు.

ఈయన మరణం తెలుగు, తమిళ, హిందీ, మలయాళ పరిశ్రమలకు తీరని లోటు అని చెప్పాలి. ఈ రెండు వార్తలకే తీవ్ర దిగ్బ్రాంతిలో ఉన్న టాలీవుడ్ ను తారక రత్న గుండెపోటు వార్త కుదిపేసింది అనే చెప్పాలి. ప్రస్తుతం తారకరత్న హెల్త్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉందని ఇన్సైడ్ టాక్. మరోపక్క విష్ణు ప్రియ తల్లిగారు కూడా నిన్న మరణించినట్టు ఈరోజు తెలిపింది. ఈ వార్తలకే అంతా అయోమయంలోకి వెళ్లిపోయే పరిస్థితి వస్తే…

కమెడియన్ ‘జోష్’ రవికి కూడా యాక్సిడెంట్ అయ్యింది అనే వార్త బయటకు వచ్చింది. నిన్న రచ్చ రవి కారు యాక్సిడెంట్ కు గురైనట్టు ప్రచారం జరిగింది. కానీ అది రచ్చ రవి కారు కాదు ‘జోష్’ రవి. ‘జబర్దస్త్’ తో బాగా పాపులర్ అయిన ఇతను ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రంతో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.

ఇతను మెగాస్టార్ చిరంజీవిని, రజినీకాంత్ ను యాజ్ ఇట్ ఈజ్ గా ఇమిటేట్ చేయగలడు. తన మిమిక్రీతో మంత్ర ముగ్దుల్ని చేయగలడు. అయితే నిన్న అంటే జనవరి 26న ఇతను విజయవాడ నుండి హైదరాబాద్ కు కారులో వస్తుంటే ప్రమాదం చోటు చేసుకుందట. అయితే అదృష్టం కొద్దీ అతను చిన్న చిన్న గాయాలతో బయటపడినట్లు సమాచారం.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus