30 ఇయర్స్ పృథ్వీ గురించి తెలియని వాళ్ళంటూ ఉంటారా. సినిమాల్లో ఈయన చేసే కామెడీ ఓ రేంజ్లో అలరిస్తుంటుంది. ఈ మధ్య సరదాగా రాజకీయాల్లోకి కూడా వచ్చాడు. వైసిపి పార్టీలో చేరి.. ఆ పార్టీకి కిందా మీదా పడి ప్రచారం చేసాడు. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ తో సహా కొందరి నేతల పై సెటైర్లు వేసాడు. ఇక్కడివరకూ బాగానే ఉంది. ఎన్నికల ప్రచారం కాబట్టి ఇలా ఇతర పార్టీల నాయకుల పై సెటైర్లు వేయడం వారి మీద విరుచుకు పడటం కామన్. అయితే ఎన్నికలు ముగిసాయి. చాలా వరకూ ప్రశాంత వాతావరణం ఉంది. ఇలాంటి సమయంలో పృద్వి జోస్యం చెప్పడం కొంచెం వివాదంగా మారింది.
‘జనసేన’ అధ్యక్షుడుపవన్ కళ్యాణ్ .. భీమవరం, గాజువాకల నుండీ పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు ప్రాంతాల్లోనూ పవన్ గెలుస్తాడని అటు అభిమానులకి, ఇటు ఆ పార్టీ నేతలకి గట్టి నమ్మకం ఉంది. అయితే వారి నమ్మకం పై నీళ్ళు జల్లే ప్రయత్నం చేసాడు. ‘గాజువాకలో పవన్ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెబుతున్నాడు పృథ్వీ.అక్కడి రాజకీయం పూర్తిగా వైకాపా పార్టీవైపే ఉందని, అక్కడ వైకాపా అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమంటున్నాడు’..! పృథ్వీ ఇలా కామెంట్ చేయడం పై కొందరు పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ‘జగన్ నీకు ఎంత ఇచ్చాడు, అయినా ఎన్నికల వరకూ పర్వాలేదు, ఎన్నికలైపోయిన తర్వాత కూడా నీ పార్టీ గురించి గెలుస్తుందని చెప్పుకో.. అంతేకానీ ఇతర పార్టీలు ఓడిపోతాయని నువ్వెలా చెబుతావ్.. నువ్వేమైనా జ్యోతిస్యుడువా’ అంటూ పృథ్వీని ట్రోల్ చేస్తున్నారు.