టాలీవుడ్లో ఉన్న పాపులర్ కమెడియన్స్ లో ఒకరు స్నిగ్ద (Snigdha) . పైకి చూడటానికి అబ్బాయిలా కనిపిస్తూ కామెడీ చేసే ఈమె.. అమ్మాయే. ‘అల మొదలైంది’ (Ala Modalaindi) ‘అంతకు ముందు ఆ తర్వాత’ (Anthaka Mundu Aa Tarvatha) ‘బందిపోటు’ (Bandipotu) ‘టైగర్’ (Tiger) ‘జత కలిసే’ ‘ఒక్కడినే’ (Okkadine) వంటి సినిమాల్లో ఈమె నటించింది. సినిమాల్లో కామెడీ చేస్తున్నప్పటికీ ఈమె జీవితంలో చాలా ట్రాజెడీ ఉంది. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న ఆమె తన జీవితంలో ఉన్న విషాదం గురించి చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ.. “నా పై మొలస్టేషన్ జరిగింది.అదీ ఇదీ ఏముంది డైరెక్ట్ గానే చెప్పుకుందాం..! నా పై రేప్ అటెంప్ట్ చేశారు. కానీ నేను ఎలాగోలా తప్పించుకుని పారిపోయాను. కానీ చాలా కాలం అదే ట్రాన్స్ లో ఉండిపోయాను. 10 ఏళ్ళ పాటు ఆ బాధని మోసాను.ఆ టైంలో ఎవరిని చూసినా అనుమానంగానే ఉండేది. నాన్న పక్కన పడుకున్నా నాకు భయమేసేది. నాన్న, మామ ఎవరు పట్టుకున్నా వాళ్లది గుడ్ టచ్చా? బ్యాడ్ టచ్చా? అనే అనుమానం, భయం ఉండేవి.
పాపం వాళ్లకి వేరే ఉద్దేశం ఏమీ ఉండదు. ముందులానే నన్ను పాంపర్ చేసేవాళ్లు అంతే.! కానీ, నాకు మాత్రం భయంగా ఉండేది. అలాగే నా జీవితంలో రిగ్రెట్ ఫీలయ్యే ఓ విషయం కూడా ఉంది. గతంలో ఒకసారి మా అమ్మ నన్ను మా ఇంటికి పిలిచేది. కానీ లేట్ చేసి తర్వాత ఎప్పుడో వెళ్లాను. అప్పుడు మా అమ్మ చనిపోయింది. ఆమె అడిగి ఉన్నప్పుడు వెళ్లుంటే బాగుండేది కదా అనే రిగ్రెట్ ఇప్పటికీ ఉంది” అంటూ స్నిగ్ద ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!
కర్ణాటకలో సినిమాలు బ్యాన్ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్