తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి హీరోకి ఓ ప్రత్యేకత ఉంది. బాడీ ల్యాగ్వేంజ్, కథల ఎంపిక ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. అందుకే ఒక హీరోని మరొక హీరోతో పోల్చి చూడలేము. అయితే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినీ పయనాన్ని జాగ్రత్తగా గమనిస్తే కొన్ని కామన్ పాయింట్స్ కనిపిస్తాయి. ఆశ్చర్యం కలిగించే ఆ విషయాలు ఏమిటంటే…
భూమిక ఇచ్చిన బ్లాక్ బస్టర్పవన్ కి యువతలో ఫాలోయింగ్ ని పెంచిన సినిమా ఖుషి. మహేష్ సినీ కెరీర్ ని మలుపుతిప్పిన మూవీ ఒక్కడు. ఈ రెండు సినిమాలు వారికి ఏడోవ సినిమా. అంతేకాదు ఈ రెండింటిలో హీరోయిన్ భూమిక కావడం మరో విశేషం.
హైదరాబాదీస్ఖుషి, ఒక్కడు సినిమాల్లో పవన్, మహేష్ లు ఇద్దరూ హైదరాబాదీస్ గా నటించారు.
ఖాకీ డ్రస్ వేస్తే హిట్పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో పోలీస్ గా కనిపించారు. అలాగే పోకిరి సినిమాలో మహేష్ బాబు అండర్ కాప్ గా నటించారు. ఈ రెండు చిత్రాలు వారి కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి
వెంకీతో కలిసి మల్టీ స్టారర్మల్టీ స్టారర్ సినిమాలు చేయడం స్టార్లకు కొత్తేమి కాదు. అయితే మహేష్, పవన్ లు విడివిడిగా మల్టీ స్టారర్ మూవీలు చేశారు. అందులో మరో హీరోగా విక్టరీ వెంకటేష్ నటించడం విశేషం.
సొంత బ్యానర్లు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రయివేట్ లిమిటెడ్ అనే సొంత బ్యానర్లు ఉన్నాయి. వీరిద్దరూ తమ పేర్లతోనే బ్యానర్లు స్థాపించడం వారి అభిరుచిని తెలియజేస్తోంది.
బెస్ట్ ఫ్రెండ్ త్రివిక్రమ్ అనేక మంది దర్శకులతో ఈ స్టార్ హీరోలు పనిచేశారు. కానీ త్రివిక్రమ్ అంటే మాత్రం ఇద్దరికీ చాలా ఇష్టం. సినిమా విషయాలే కాకుండా ఇతర విషయాల గురించి కూడా గంటల తరబడి చర్చించుకుంటుంటారు.
సంగీత బ్రహ్మలుమెలోడీ బ్రహ్మ మణిశర్మ, రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ లు పవన్, మహేష్ లకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఖుషి, ఒక్కడు చిత్రాలకు మణిశర్మ మ్యూజిక్ అందించగా, గబ్బర్ సింగ్ , శ్రీమంతుడు సినిమాలకు దేవీ హుషారైన ట్యూన్స్ ఇచ్చారు.