Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

శ్రీవిష్ణు సినిమాలంటే మినిమమ్ గ్యారెంటీ అనే అభిప్రాయానికి ఆల్మోస్ట్ అన్ని వర్గాల ప్రేక్షకులు వచ్చేశారు. ‘సింగిల్’ తో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రీవిష్ణు తర్వాత ‘విష్ణు విన్యాసం’ ‘మృత్యుంజయ్’ అనే సినిమాలు చేశాడు. థియేటర్లలో అవి అంతంత మాత్రమే ఆడియనప్పటికీ, ఓటీటీల్లో మాత్రం మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. అలా శ్రీవిష్ణు పై ఉన్న నమ్మకాన్ని కాపాడాయి. ఇప్పుడు ‘కామ్రేడ్ కళ్యాణ్’ (Comrade Kalyan) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

Comrade Kalyan

అక్టోబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఆదర్శ కుటుంబం’ వాయిదా పడటంతో ఈ వారం ఆడియన్స్ కి ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది ‘కామ్రేడ్ కళ్యాణ్’. స్టార్ డైరెక్టర్ బాబీ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన జానకిరామ్ మారెళ్ల ఈ చిత్రానికి దర్శకుడు. కోన వెంకట్ సమర్పణలో వెంకట కృష్ణ కర్నాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఒక పాటకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆల్రెడీ ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలు వీక్షించడం జరిగింది.

సినిమా చూసిన వారు తర్వాత తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. వారి టాక్ ప్రకారం.. సినిమా 2 గంటల 25 నిమిషాల నిడివి కలిగి ఉందట. శ్రీవిష్ణు కామిడీ ఔట్ అండ్ ఔట్ హిలేరియస్ ఫీలింగ్ ఇస్తుంది అంటున్నారు. సెకండాఫ్ లో కంటెంట్ మరింత ఇంప్రెస్ చేస్తుందట. కచ్చితంగా ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి అంటున్నారు. మరి రిలీజ్ రోజున ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి!

మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus