Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

శ్రీవిష్ణు నుండీ ఒక సినిమా వస్తుంది అంటే సహజంగానే అంచనాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్..లో శ్రీవిష్ణుకి మంచి క్రేజ్ ఉంది. ఇదిలా ఉండగా.. శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కామ్రేడ్ కళ్యాణ్'(Comrade Kalyan). జానకీరామ్ మారెళ్ల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. కోన వెంకట్ ఈ చిత్రానికి ప్రెజెంటర్ గా వ్యవహరించారు. విజయ్ బుల్గేనిన్ సంగీత దర్శకుడు. ‘ఒరియా పిల్లా’ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్, ట్రైలర్ వంటివి కూడా పర్వాలేదు అనిపించాయి.

Comrade Kalyan

దీంతో సినిమాకి డీసెంట్ బిజినెస్ జరిగింది. ఒకసారి వాటి వివరాలు అలాగే బ్రేక్ ఈవెన్ వివరాలను ఒకసారి గమనిస్తే :

నైజాం 3.5 cr
సీడెడ్ 0.5 cr
ఆంధ్ర(టోటల్) 3 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 7 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.50 cr
ఓవర్సీస్ 0.50 cr
వరల్డ్ వైడ్(టోటల్) 8 cr

‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్రానికి రూ.8 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.8.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమాకి పాజిటివ్ టాక్ కనుక వస్తే.. దసరా హాలిడేస్ అడ్వాంటేజ్ తో సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ‘ఆదర్శ కుటుంబం’ వంటి పెద్ద సినిమా కూడా వాయిదా పడటంతో కామ్రేడ్ కళ్యాణ్ సినిమాకి మరింత కలిసొచ్చే అంశం అని చెప్పాలి. మరి ఆ అవకాశాన్ని ఎంతవరకు సద్వినియోగపరుచుకుంటుందో చూడాలి.

ఒకవేళ ఈ సినిమా పాజిటివ్ టాక్ కనుక రాబట్టుకోకపోతే.. పోటీగా రిలీజ్ అయ్యే ‘హనుమాన్ అంశ్’ క్యాష్ చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు.

రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

 

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus