కాపీ, స్ఫూర్తి.. ఈ రెండు పదాల మధ్య చాలా దూరం ఉంటుంది. రెండోది కాస్త సేఫ్ కానీ.. తొలి పదం అయితే చాలా డేంజర్. ఓ సినిమాను కాపీ కొట్టినట్లు తేలితే తొలుత నెటిజన్లు తూర్పారపట్టేస్తారు. ఆ తర్వాత అసలు సినిమా టీమ్ లీగల్ నోటీసులు పంపిస్తారు. అయితే ఈ నోటీసులు ఈ మధ్య కాలంలో పెద్దగా కనిపించడం లేదు. అయితే అజిత్ (Ajith) కొత్త సినిమా ‘విదా మయూర్చి’కి లీగల్ నోటీసులు వచ్చాయి అని ఓ వార్త వైరల్ అవుతోంది.
Ajith
కోడంబాక్కం వర్గాల సమాచారం ప్రకారం ‘విదాయమూర్చి’ సినిమా టీమ్‌కి హాలీవుడ్ సినిమా ‘బ్రేక్ డౌన్’ టీమ్ నుండి నోటీసులు వచ్చాయట. ఏకంగా రూ. 125 కోట్లు చెల్లించాలి అని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు అని సమాచారం. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘విదాముయార్చి’. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా టీమ్ ఇటీవల ఓ టీజర్‌ను రిలీజ్చేసింది. దాంతో టీమ్ ఇప్పుడు న్యాయ వివాదంలో చిక్కుకుందని అంటున్నారు.
‘విదాముయార్చి’ సినిమాకు 1997లో విడుదలైన హాలీవుడ్ చిత్రం ‘బ్రేక్‌డౌన్’కు అనధికారిక రీమేక్ అని ఆ టీజర్ విజువల్స్ చూసిన కొందరు అనుకున్నారు. ఇప్పుడు ఆ సినిమా నిర్మాణ సంస్ద రైట్స్ కోసం డబ్బులు కట్టమంటూ రంగంలోకి దిగింది అని చెబుతున్నారు. రోడ్ థ్రిల్లర్‌గా జోనాథన్ మోస్తోవ్ తెరకెక్కించిన ఈ సినిమాలో కర్ట్ రస్సెల్ ప్రధాన పాత్రధారి.
ఈ సినిమా హక్కులు తీసుకోండా ‘విదామయూర్చి’ తీస్తున్నారు అని మాతృక నిర్మాణ సంస్థ 15 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 127 కోట్లు) పరిహారం డిమాండ్ చేసిందట. అయితే ఈ విషయంలో ‘విదామయూర్చి’ టీమ్ నుండి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. నిజంగానే ఆ సినిమా కాపీ చేశారా లేక స్ఫూర్తి పొందారా లేక రెండూ వేర్వేరు కథలా అనేది టీమే చెప్పాలి.