అజిత్‌ సినిమాకు ‘కాపీ’ కష్టం.. రూ.125 కోట్లు కట్టమంటూ నోటీసులొచ్చాయా?

కాపీ, స్ఫూర్తి.. ఈ రెండు పదాల మధ్య చాలా దూరం ఉంటుంది. రెండోది కాస్త సేఫ్‌ కానీ.. తొలి పదం అయితే చాలా డేంజర్‌. ఓ సినిమాను కాపీ కొట్టినట్లు తేలితే తొలుత నెటిజన్లు తూర్పారపట్టేస్తారు. ఆ తర్వాత అసలు సినిమా టీమ్‌ లీగల్‌ నోటీసులు పంపిస్తారు. అయితే ఈ నోటీసులు ఈ మధ్య కాలంలో పెద్దగా కనిపించడం లేదు. అయితే అజిత్‌  (Ajith)  కొత్త సినిమా ‘విదా మయూర్చి’కి లీగల్‌ నోటీసులు వచ్చాయి అని ఓ వార్త వైరల్‌ అవుతోంది.

Ajith

కోడంబాక్కం వర్గాల సమాచారం ప్రకారం ‘విదాయమూర్చి’ సినిమా టీమ్‌కి హాలీవుడ్‌ సినిమా ‘బ్రేక్‌ డౌన్‌’ టీమ్‌ నుండి నోటీసులు వచ్చాయట. ఏకంగా రూ. 125 కోట్లు చెల్లించాలి అని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు అని సమాచారం. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘విదాముయార్చి’. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా టీమ్‌ ఇటీవల ఓ టీజర్‌ను రిలీజ్‌చేసింది. దాంతో టీమ్‌ ఇప్పుడు న్యాయ వివాదంలో చిక్కుకుందని అంటున్నారు.

‘విదాముయార్చి’ సినిమాకు 1997లో విడుదలైన హాలీవుడ్ చిత్రం ‘బ్రేక్‌డౌన్’కు అనధికారిక రీమేక్ అని ఆ టీజర్‌ విజువల్స్‌ చూసిన కొందరు అనుకున్నారు. ఇప్పుడు ఆ సినిమా నిర్మాణ సంస్ద రైట్స్ కోసం డబ్బులు కట్టమంటూ రంగంలోకి దిగింది అని చెబుతున్నారు. రోడ్ థ్రిల్లర్‌గా జోనాథన్ మోస్తోవ్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో కర్ట్ రస్సెల్ ప్రధాన పాత్రధారి.

ఈ సినిమా హక్కులు తీసుకోండా ‘విదామయూర్చి’ తీస్తున్నారు అని మాతృక నిర్మాణ సంస్థ 15 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 127 కోట్లు) పరిహారం డిమాండ్ చేసిందట. అయితే ఈ విషయంలో ‘విదామయూర్చి’ టీమ్‌ నుండి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. నిజంగానే ఆ సినిమా కాపీ చేశారా లేక స్ఫూర్తి పొందారా లేక రెండూ వేర్వేరు కథలా అనేది టీమే చెప్పాలి.

మైత్రీ నిర్మాతలకు తలనొప్పి.. అంత రేటు ఏంటి అంటూ డైరెక్ట్‌గా అడిగిన ఫ్యాన్‌!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus