డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోయే పుష్ప 2: ది రూల్(Pushpa 2: The Rule) మంచి హైప్ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఫ్యాన్స్ సందడితో నిండిపోతున్నాయి. ప్రీమియర్ షోలకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. అయితే వీటిలో నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి టీమ్ తరఫున పెట్టిన ఓ బ్యానర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Pushpa 2 The Rule
ఆ బ్యానర్‌లో అల్లు అర్జున్ (Allu Arjun) , శిల్పా రవిచంద్ర కలిసి ఉన్న ఫొటోతో పాటు, ‘పుష్ప 2’ రిలీజ్ పట్ల శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఈ బ్యానర్‌పై స్పందించిన ఐకాన్ స్టార్ అభిమానులు, స్నేహం సినిమాలకే పరిమితమవ్వాలి, రాజకీయాలు మధ్యకి రావద్దని అభిప్రాయపడ్డారు. అయితే కొద్దీ సేపటి అనంతరం కొంతమంది ఆ ఫ్లెక్సీని తొలగించారు. అయితే ఈ ఘటన పుష్ప 2 ప్రమోషన్లను మరింత హైలైట్ చేసినట్లయింది.
గతంలోనూ అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర మధ్య సాన్నిహిత్యం వివాదానికి దారితీసింది. నంద్యాల ఎన్నికల సమయంలో బన్నీ పరోక్షంగా శిల్పా రవికి మద్దతు తెలిపినట్లు వచ్చిన వార్తలు మెగా ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలలో విమర్శలు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం కూడా ఈ బ్యానర్ వివాదం ఆ అంశాన్ని మళ్లీ జ్ఞాపకం చేసింది. అయినా, శిల్పా రవి ఇటీవల బన్నీకి పుష్ప 2 పై మద్దతు తెలుపుతూ చేసిన సోషల్ మీడియా పోస్టులకు బన్నీ సమాధానం ఇచ్చిన తీరు ఇద్దరి మధ్య ఉన్న స్నేహానికి ఉదాహరణగా నిలిచింది.
ఏదేమైనా పుష్ప 2 క్రేజ్ నేడు పీక్స్‌లో ఉంది. శిల్పా రవి లాంటి ప్రముఖులు సినిమా ప్రమోషన్‌లో భాగం కావడం ఈ హైప్‌ను మరింత పెంచుతోందని మరికొందరు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ తరహా వాతావరణం ఓ వర్గం ఫ్యాన్స్ కు మాత్రం నచ్చడం లేదు. పాలిటిక్స్ ను సినిమాలకు మిక్స్ చేయవద్దని అంటున్నారు. ఇక పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ ఏం మాట్లాడుతారు అనేది మరింత ఆసక్తికరంగా మారింది.