ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా ‘పొన్నియిన్ సెల్వన్’. ఈ సినిమాను రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. సెప్టెంబర్ 30న ఫస్ట్ పార్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. కొన్ని దశాబ్దాల క్రితం చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
ఇటీవల ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమా వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా టీజర్ లో పలు సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మణిరత్నం, హీరో విక్రమ్ లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ సినిమాలో చోళులను, చోళ రాజవంశం గురించి తప్పుగా చూపించారని ఆరోపిస్తూ..
సెల్వం అనే లాయర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీజర్ లో విక్రమ్ పోషించిన ఆదిత్య కరికాలన్ నుదిటిపై తిలకం లేదని ఎత్తి చూపిస్తున్నారు లాయర్ సెల్వం. నిజానికి విక్రమ్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు మాత్రం తిలకం ఉంది. ఈ సినిమాలో చోళులను తప్పుగా చూపించారని ఆయన ఆరోపిస్తున్నారు.
చరిత్రను నిజాయితీగా చూపించడంలో దర్శకనిర్మాతలు ఫెయిల్ అయ్యారేమోనని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దీనిపై క్లారిటీ రావాలంటే సినిమా విడుదలకు ముందే ప్రత్యేకంగా షో వేసి చూపించాలని తన పిటిషన్ లో పేర్కొన్నారు లాయర్ సెల్వం. అయితే ఇప్పటివరకు ఈ నోటీసులపై అటు విక్రమ్ కానీ.. ఇటు మణిరత్నం కానీ స్పందించలేదు.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!