సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేశారంటూ ప్రముఖ హీరోయిన్ సమంత నిన్న కూకట్పల్లి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సమంత పిటిషన్ పై త్వరగా విచారణ చేపట్టాలని.. సెలబ్రిటీలను కించపరిచే వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టుకి విజ్ఞప్తి చేశారు సమంత తరఫు న్యాయవాది. దీనిపై వాదనలు ముగియగా.. పరువు నష్టం దావా వేసే బదులు..వారి నుంచి క్షమాపణ అడగొచ్చు కదా అని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలు పబ్లిక్ డొమైన్లో పెట్టేది వారే..
పరువుకు నష్టం కలిగింది అనేది వారే అంటూ కోర్టు పేర్కొంది. సమంత విడాకులు తీసుకోకుండానే సమంత జీవితం గురించి అభ్యంతరకర వీడియోలు, కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. సమంత ప్రతిష్టకు భానగం కలిగించేలా ఆమెని టార్గెట్ చేసి వార్తలు రాశారని తెలిపారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ.. డాక్టర్ సీఎల్ వెంకట్రావుతో పాటు సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ యూట్యూబ్ ఛానళ్లపై పరువునష్టం దావా దాఖలు చేశారు సమంత.
నాగచైతన్యతో ముగిసిన తన వైవాహిక జీవితానికి సంబంధించి ఆ రెండు ఛానళ్లలో వెంకట్రావు అసత్య ప్రచారాలు చేస్తూ కించపరిచారని పిటిషన్లో పేర్కొన్నారు.