టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

సినిమా వాళ్ళు అనగానే… ‘చదువు అబ్బక ఖాళీగా తిరగడం వలన… కాలం కలిసొచ్చి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఉంటారు’ అనే అపోహ చాలా మందిలో ఉంది. చిత్తూరు నాగయ్య గారి దగ్గరి నుండీ ఇప్పటి యంగ్ హీరో నాగశౌర్య లను కూడా అదే విధంగా చూస్తున్నారు సామాన్యులు.కానీ అసలు నిజం వాళ్లకి తెలీదు. ‘నిజానికి చదువుకుని జాబ్ చేసుకునే వాడికి ఉన్న సుఖం.. ఇండస్ట్రీలో ఉన్న ఏ ఒక్కరికీ ఉండదు.ఇక్కడ ఒక్కొక్కరు పడే కష్టాలను చదువుకొనే రోజుల్లో పడుంటే.. కచ్చితంగా కలెక్టర్లు అయిపోయేవారు’ అంటూ విజయ్ దేవరకొండ చెప్పిన కామెంట్స్ అందరికీ గుర్తుండే ఉంటాయి. అది వాస్తవం… అదే వాస్తవం.

సరే ఇప్పుడంటే వీకీపీడియా, ఇంటర్నెట్ వంటివి అందుబాటులో ఉన్నాయి కాబట్టి సినిమాల్లోకి రాకముందు నటీనటుల నేపథ్యం ఏమిటి? వాళ్ళు ఏ విధంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అనేది తెలుసుకోగలుగుతున్నాం. కానీ ఒకప్పుడు ఇలాంటివేవి లేకపోవడంతో కేవలం చదువు ఒంటపట్టక ముందు నాటకాలు ఆపై సినిమాల్లోకి వెళ్లారని జనాలు తప్పుగా అర్ధం చేసుకునే వారు. కానీ ఆ రోజుల్లో కూడా ఉన్నత విద్యను అభ్యసించిన సినిమాల్లోకి వచ్చిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. మరీ ముఖ్యంగా బి.టెక్ చేసి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు అంటే అతిశయోక్తి లేదు.ఈ విషయాలను పక్కన పెట్టేసి టాలీవుడ్లో బి.టెక్ చదివిన వాళ్ళు ఎంత మంది ఉన్నారో ఓ లుక్కేద్దాం రండి :

1)కళ్యాణ్ రామ్ :

నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీ నుండీ వచ్చిన మూడో తరం హీరో కళ్యాణ్ రామ్ …. హీరోగా నటిస్తూనే నిర్మాతగాను రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హైదరాబాద్‌లోని సెయింట్ పాల్స్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న కళ్యాణ్ రామ్ అనంతరం ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ప్రతిష్టాత్మక బిట్స్ పిలానీ నుంచి ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కల్యాణ్ రామ్.. అక్కడి ఇల్లినాయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుని అమెరికాలో కొన్నాళ్ల పాటు ఉద్యోగం కూడా చేశారు.

2)అక్కినేని నాగార్జున:

కింగ్ నాగార్జున కూడా చెన్నై లో ఇంజనీరింగ్ చేసి , అమెరికాలో ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ పట్టా అందుకున్నారు.

3)రీతూ వర్మ:

Actress Ritu Varma,Ritu Varma New Stills,Ritu Varma Photoshoot

‘బాద్ షా’ ‘ఎవడె సుబ్రహ్మణ్యం’ చిత్రాలతో టాలీవుడ్ కు పరిచయమైన రీతూ వర్మ… ‘పెళ్ళిచూపులు’ మూవీతో హీరోయిన్‌గా నిలదొక్కుకుంది.ఈమె మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పట్టా అందుకుంది.

4)వెన్నెల కిశోర్:

Vennela Kishore latest pic

ప్రస్తుతం ఉన్న అగ్రశ్రేణి కమెడీయన్‌లలో వెన్నెల కిషోర్ ఒకరు. అమెరికాలోని ఫెర్రిస్ స్టేట్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ అందుకున్న కిశోర్.. అనంతరం అక్కడి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేసాడు.

5) శేఖర్ కమ్ముల:

ఫీచర్ సినిమాలకు, అందమైన ప్రేమ కథలకు కేరాఫ్ అడ్రస్‌ అయిన దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా… హైదరాబాద్‌లోని చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) లో ఇంజినీరింగ్ చేసినవారే. అటు తర్వాత ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ కూడా చేశారు.

6) అవసరాల శ్రీనివాస్ :

కమెడియన్ గా, హీరోగా, డైరెక్టర్ గా ఇలా అన్ని రకాలుగా ప్రూవ్ చేసుకున్నాడు అవసరాల. ఇతను కూడా అమెరికాలోని నార్త్ డకోటా యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేసి.. అక్కడ కొన్నాళ్ళ పాటు ఉద్యోగం కూడా చేసాడు.

7) తాప్సి :

తెలుగు సినిమాలతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా బాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకుంది ఈ నటి.ఈమె కూడా న్యూఢిల్లీలోని గురు తేగ్ బహదూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థలో కంప్యూటర్ సైన్స్ గ్రూప్ లో ఇంజినీరింగ్ చేసింది.

8)అనిల్ రావిపూడి :

‘పటాస్’ తో దర్శకుడిగా మారిన ఒకప్పటి రైటర్ అనిల్ రావిపూడి కూడా బి.టెక్ స్టూడెంటే..!ఇతనికి ఎం.సెట్ లో 8000వ రాంక్ వచ్చింది. అయినప్పటికీ పే మెంట్ సీట్ ద్వారా ఇంజినీరింగ్ చదువుకున్నట్టు.. ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

9)అభిజీత్ :

‘బిగ్ బాస్4’ విన్నర్ అభిజీత్ కూడా జె.ఎన్.టి.యు హైదరాబాద్ లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు.

10)రాంగోపాల్ వర్మ :

Ram Gopal Varma about coronavirus1

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఉన్న సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నారు వర్మ.

Share.