ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?

రాజమౌళి దయవల్ల టాలీవుడ్ మార్కెట్ పెరిగింది. గతంలో టాలీవుడ్ సినిమాలకు రూ.70 కోట్ల వరకు మాత్రమే బిజినెస్ జరిగేది. కానీ ‘బాహుబలి’ తర్వాత అది 100 కోట్లు, 200 కోట్లు దాటింది. అంతేకాదు మన సినిమాలు హిందీలో కూడా వరుసగా రీమేక్ అవుతున్నాయి.ఈ నేపథ్యంలో మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు పాన్ ఇండియా సినిమాలు రూపొందించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి హీరోలు ఎక్కువ రోజులు కాల్ షీట్లు ఇవ్వాల్సి వస్తుంది. దీంతో ఇప్పుడు కరోనా వల్ల నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ స్టార్ హీరోలు ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తున్నారట. ఆ హీరోలు ఎవరు వారు డిమాండ్ చేస్తున్న పారితోషికాలు ఎంత అనే వివరాలను ఓ లుక్కేద్దాం రండి :

1) ప్రభాస్ :

ఇప్పుడు ఇతను పాన్ ఇండియా హీరో. ఒక్కో సినిమాకు రూ.80 కోట్లు పైనే అందుకుంటున్నాడు.

2) పవన్ కళ్యాణ్ :

ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తున్న పవన్ కళ్యాణ్.. పారితోషికాన్ని కూడా భారీగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.’వకీల్ సాబ్’ కు రూ.50 కోట్లు పారితోషికం అందుకున్న పవన్ కళ్యాణ్, ‘హరి హర వీర మల్లు’ చిత్రానికి ఏకంగా రూ.65 కోట్లు అందుకున్నాడట.

3) మహేష్ బాబు :

మొన్నటి వరకు రూ.50 కోట్లు తీసుకుంటూ వచ్చిన మహేష్ బాబు.. ఇప్పుడు చేయబోయే సినిమాలకు రూ.55 కోట్లు అలాగే నాన్ థియేట్రికల్ రైట్స్ లో వాటా కూడా డిమాండ్ చేస్తున్నాడట.

4) ఎన్టీఆర్ :

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి రూ.40 కోట్లు తీసుకున్న ఎన్టీఆర్, తర్వాత చేయబోయే సినిమాలకు రూ.45 కోట్లతో పాటు తన అన్న కళ్యాణ్ రామ్ ను సహా నిర్మాతగా పెట్టుకుని వాటా డిమాండ్ చేస్తున్నాడట.

5) రాంచరణ్ :

‘ఆర్.ఆర్.ఆర్’ కు రూ.40 కోట్లు తీసుకున్న చరణ్.. తర్వాత చేయబోయే సినిమాలకు రూ.45 కోట్లు పైనే డిమాండ్ చేస్తున్నారు.

6) చిరంజీవి :

‘ఆచార్య’ చిత్రానికి గాను రూ.35 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారట చిరు. చరణ్ కూడా నిర్మాతగా చేస్తూనే చిన్న పాత్ర కూడా చేస్తున్నాడు కాబట్టి.. రూ.80 కోట్ల వరకు వీళ్లిద్దరి పారితోషికం ఉన్నట్టు తెలుస్తుంది.

7)అల్లు అర్జున్ :

‘పుష్ప’ రెండు పార్ట్ లకు కలుపుకుని రూ.65 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు బన్నీ. అంతేకాదు నాన్ థియేట్రికల్ రైట్స్ లో లాభాలు కూడా తీసుకుంటున్నారు.

8) బాలకృష్ణ :

మొన్నటి వరకు రూ.7 కోట్లు తీసుకునే బాలయ్య.. ఇప్పుడు రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నారు.

9) నాగార్జున :

10-Nagarjuna

మొన్నటి వరకు రూ.6 కోట్లు తీసుకునే నాగ్.. ఇప్పుడు రూ.7 కోట్లు డిమాండ్ చేస్తున్నారు.

10) వెంకటేష్ :

Venkatesh to work for a web series1

మొన్నటి వరకు రూ.7 కోట్లు తీసుకునే వెంకీ ఇప్పుడు రూ.8 కోట్లు డిమాండ్ చేస్తున్నారు.

11) విజయ్ దేవరకొండ :

మొన్నటి వరకు రూ.8 కోట్లు తీసుకునే విజయ్ ఇప్పుడు రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు.

12) నాని :

ఇతను కూడా మొన్నటి వరకు రూ.8 కోట్లు తీసుకునేవాడు. కానీ ఇప్పుడు రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు.

13) రవితేజ :

‘క్రాక్’ హిట్టవడంతో రవితేజ కూడా రూ.8 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట.

14) వరుణ్ తేజ్ :

ఇతను కూడా రూ.8 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట.

15) శర్వానంద్ :

ఒక్కో సినిమాకి శర్వా రూ.7 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట.

Share.