మన దేశంలో ఎక్కువమంది జనాలకు బాగా ఇష్టమైన విషయాలు ఏంటి అంటే… ఒకటి సినిమా, రెండోది క్రికెట్. ఈ విషయంలో భిన్నాభిప్రాయలు ఉండొచ్చు కానీ… ఆ డిస్కషన్ ఏది ముందు, ఏది తర్వాత అనే తప్ప… ఈ రెండూ కావు అని కాదు. ఇప్పుడు ఎందుకు ఈ రెండింటి మధ్య కంపారిజన్ అనుకుంటున్నారా? సినిమాల విషయంలో స్పెషల్ డే, క్రికెట్ విషయంలో స్పెషల్ ఈవెంట్ ఒకేసారి ఇప్పుడు ఉన్నాయి. దీంతో రెండింటిలో విజయం సాధించేది ఏది అనే చర్చ మొదలైంది.
నాలుగేళ్లకోసారి వచ్చే క్రికెట్ పండగ ‘వన్డే ప్రపంచకప్’. టీ20 క్రికెట్ వచ్చాక ఈ క్రికెట్ పండగ దగ్గర దగ్గర్లో వస్తోంది కానీ.. ఒకప్పుడు నాలుగేళ్లకే వచ్చే ఈ పండగకు పెద్ద ఎత్తున బజ్ ఉండేది. ఆ పండగ ప్రస్తుతం మన దేశంలో నడుస్తోంది. అందులో మన దేశం హాట్‌ఫేవరేట్‌గా వరుస విజయాలతో దూసుకుపోతోంది. మరోవైపు దసరా సీజన్ మరికొద్ది రోజుల్లో వచ్చేస్తుంది. ఆ సీజన్‌లో మన దగ్గర మూడు పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి కూడా.
దీంతో ఈ విజయదశమికి విజయం ఎవరిని వరిస్తుంది అనే ప్రశ్న ఉదయించింది. ప్రజలు క్రికెట్ చూడటానికి ఇష్టపడి సినిమాలకు వసూళ్లు తగ్గిస్తారా? లేక సినిమాలను చూస్తూ టీవీ టీర్పీలు, ఓటీటీల వ్యూయర్ షిప్‌లు తగ్గుతాయా అనేది ఇప్పుడు చర్చ. ఈ విజయదశమికి తెలుగులో రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’, బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ సినిమాలు వస్తున్నాయి. తమిళంలో విజయ్ ‘లియో’ రిలీజ్ అవుతోంది. 19, 20 తేదీల్లో ఈ సినిమాలు (Cinema) వస్తున్నాయి.
ఇక అదే సమయంలో 19న ఇండియా – బంగ్లాదేశ్ మ్యాచ్ ఉంటుంది. ఇక 21న ఇండియా – న్యూజిలాండ్ పోరు ఉంటుంది. మరోవైపు 29న ఇండియా – ఇంగ్లాండ్ గేమ్ ఉంది. దీంతో ఆయా రోజుల్లో సినిమా వసూళ్ల విషయంలో కాస్త ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు