Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!
- October 30, 2026 / 05:29 PM ISTByFilmy Focus Desk
Cast & Crew
- విశ్వక్ సేన్ (Hero)
- గాయత్రి భరద్వాజ్ (Heroine)
- తారక్ పొన్నప్ప, మురళీశర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు (Cast)
- విశ్వక్ సేన్ (Director)
- సందీప్ కాకర్ల (Producer)
- రవి బస్రూర్ (Music)
- అరవింద్ విశ్వనాథన్ (Cinematography)
- రవితేజ గిరిజాల (Editor)
- Release Date : అక్టోబర్ 30 2026
- తారక్ సినిమాస్ (Banner)
‘ఫలక్‌నుమా దాస్’, ‘దాస్ కా ధమ్కీ’ వంటి హిట్ల తర్వాత యువ కథానాయకుడు విశ్వక్ సేన్ ప్రధాన పాత్ర పోషిస్తూ దర్శకత్వం వహించిన మూడవ చిత్రం ‘కల్ట్’. హాలీవుడ్‌లో పాపులర్ అయిన స్లాషర్ గేమ్ నేపథ్యంలో తెరకెక్కిన సైకలాజికల్ యాక్షన్ సినిమా ఇది. టీజర్, ట్రైలర్లలో వయొలెన్స్ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే; ఆ ఒక్క విషయంతోనే ఇండస్ట్రీలో ‘కల్ట్’ చిత్రం హాట్ టాపిక్‌గా మారింది. పైగా చిన్నపిల్లలు, గుండె జబ్బులు ఉన్నవారు ఈ సినిమాకు రావొద్దని స్వయంగా హీరో విశ్వక్ సేన్ చెప్పడం అందరికీ షాక్ ఇచ్చింది. అలాగే సినిమాకి ‘ఎ’ రేటింగ్ ఇచ్చినప్పటికీ, సెన్సార్ వారు ఈ సినిమాలో చాలా సన్నివేశాలు కట్ చేశారని హీరో ప్రకటించడం జరిగింది. ఆ రేంజ్‌లో ‘కల్ట్’ సినిమాలో ఏముంది, ఈ స్లాషర్ గేమ్ టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది తెలుసుకుందాం.
Cult Review

కథ : ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబడ్డ గోవా హోంమంత్రి (మురళీ శర్మ) ఎన్నికలు ముగిసేవరకు ఎటువంటి వివాదాల్లో చిక్కుకోకూడదని జాగ్రత్త వహిస్తుంటాడు. అయితే అతని కొడుకు ఎల్విన్ (తారక్ పొన్నప్ప) తన బర్త్‌డే పార్టీని మాత్రం గ్రాండ్‌గా చేసుకోవాలని ఆశపడతాడు. ఎన్నికలు పూర్తయ్యేవరకు వద్దని తండ్రి చెప్పినప్పటికీ, నాలుగేళ్లకోసారి (ఫిబ్రవరి 29న) వచ్చే పుట్టినరోజు విషయంలో ఎల్విన్ రాజీపడడు. కొడుకు ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయడంతో హోంమంత్రి కూడా అడ్డుచెప్పడు; ఎటువంటి ఇబ్బందీ కలగకుండా పోలీసులను బందోబస్తుగా పెడతాడు. ఇక కల్ట్ (#cult) పేరుతో మొదలైన ఆ పార్టీలో ఎవరూ ఊహించని విధంగా ఓ వ్యక్తి స్లాషర్ గేమ్‌ను నిర్వహిస్తాడు. అందులో భాగంగా వచ్చిన వారందరితో ఏదో ఒక గేమ్ ఆడించి, ఓడిపోయిన వారిని కిరాతకంగా చంపేస్తుంటాడు. ఎవరూ బయటకు పారిపోకుండా డోర్‌కి ఆర్‌డీఎక్స్ (RDX) అమర్చుతాడు. అయితే అనుకోకుండా ఆ పార్టీకి సస్పెండ్ అయిన డీఎస్పీ సంకల్ప్ నాయక్ (విశ్వక్ సేన్) కూడా వెళ్లి, మద్యం మత్తులో పడిపోతాడు. ఈ విషయం డీజీపీ విజయ్ మిశ్రా (శ్రీకాంత్ అయ్యంగార్) ద్వారా తెలుసుకున్న హోంమంత్రి, తన కొడుకు ఎల్విన్‌ను మాత్రం కాపాడమని సంకల్ప్‌ను కోరతాడు. మరి హోంమంత్రి కోరినట్టు సంకల్ప్ ఎల్విన్‌ను కాపాడాడా? అసలు ఆ స్లాషర్ గేమ్ నిర్వహిస్తున్నది ఎవరు? మర్డర్లు చేయిస్తున్నది ఎవరు? అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు : విశ్వక్ సేన్ ఈ సినిమాలో చాలా ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చాడు; దాదాపు 45 నిమిషాల వరకు అతని పాత్ర కనిపించదు. ఇలాంటి అటెంప్ట్ ఓ టాలీవుడ్ హీరో చేయడం గొప్ప విషయమే అయినప్పటికీ, ఈ సినిమాలో విశ్వక్ కొత్తగా చేసిందేమీ లేదు. ఫైట్ మాస్టర్ చెప్పింది చేసుకుంటూ పోయాడనిపిస్తుంది. తారక్ పొన్నప్పకు డిఫరెంట్ రోల్ లభించింది. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ అయినప్పటికీ ప్యాడింగ్ ఆర్టిస్ట్‌గానే కనిపించింది. మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ తమ స్థాయికి తగ్గ పాత్రల్లో బాగా నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు: దర్శకుడిగా విశ్వక్ సేన్ ఈ సినిమా కోసం కొత్తగా చేసిందేమీ లేదు. సినిమా మొత్తంలో రెండే రెండు ప్రధాన సన్నివేశాలు ఉంటాయని చెప్పాలి. కల్ట్ పార్టీకి వెళ్లిన వారంతా హత్యకు గురవుతుంటారు. ఈ ఒక్క పాయింట్‌తోనే ప్రీ క్లైమాక్స్ వరకు కథను లాగించేశాడు. విలన్ మనుషులను పంపడం, హీరో వారిని చంపడం.. ఇదే సీన్ క్లైమాక్స్ వరకు రిపీట్ అవుతుంది. దాంతో సినిమా మొత్తాన్ని ఫైట్ మాస్టర్స్ మాత్రమే డైరెక్ట్ చేశారనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాకి ఎక్కువ ఎఫర్ట్ పెట్టింది సంగీత దర్శకుడు రవి బస్రూర్ మాత్రమే. సినిమా భారం మొత్తాన్ని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రూపంలో అతను క్లైమాక్స్ వరకు మోశాడు. మ్యూజిక్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా ఇది; క్లైమాక్స్‌లో ఆ విషయం అందరికీ అర్థమవుతుంది. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ ఇద్దరిపై కూడా దర్శకుడు ఎక్కువ భారమే పెట్టాడు. తరుణ్ భాస్కర్ సంభాషణలు అక్కడక్కడా పేలాయి. నిర్మాణ విలువలు పెద్దగా ఏమీ లేవు. తెలిసిన నటీనటులు తక్కువ, ఓ పబ్ సెట్లోనే సినిమా మొత్తం చుట్టేశారు.

విశ్లేషణ : ఇది ఎలాంటి సినిమానో మొదటి నుంచీ ఆడియన్స్‌కి అర్థమయ్యేలా వివరించి దర్శకుడు విశ్వక్ సేన్ ప్రమోట్ చేసుకోవడం అభినందనీయం. అయితే కమర్షియల్ సినిమాల్లో హింసను ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలంటే, కథలో బలమైన ఎమోషన్ ఉండాలి. ‘హిట్’ సిరీస్ సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం అదే. ఈ ‘కల్ట్’ సినిమాలో అలాంటి ఎమోషనల్ పాయింట్‌ను దర్శకుడు టచ్ చేసినప్పటికీ, అది కన్విన్సింగ్‌గా అనిపించదు. క్లైమాక్స్ వరకు ఒకే పాయింట్‌పై కథనాన్ని నడిపించి, చివర్లో బలవంతంగా ఒక ట్విస్ట్ పెడితే ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వదు. అయితే ఓటీటీల్లో ఇలాంటి వెబ్ సిరీస్‌లు పదుల సంఖ్యలో చూసిన వాళ్లకు ఈ ‘కల్ట్’ నచ్చే అవకాశం లేకపోలేదు.

ఫోకస్ పాయింట్: రూత్ లెస్ యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారికి మాత్రమే
రేటింగ్ : 1.5/5















