నవ్యమైన ప్రేమకథ : సైకిల్ Cycle Non Polluted Love story

పున‌ర్ణ‌వి భూపాలం, మ‌హ‌త్ రాఘ‌వేంద్ర శ్వేతావ‌ర్మ‌,సూర్య లీడ్‌రోల్స్‌లో ఆట్ల అర్జున్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం సైకిల్ గ్రే మీడియా బ్యాన‌ర్ పై, ఓవ‌ర‌సీస్ నెట్‌వ‌ర్క్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ విజ‌యా ఫిలింస్‌, ఓంశ్రీ మ‌ణికంఠా ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం. షూటింగ్‌తో పాటు డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్తి చేసుకుంది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు అర్జున్‌రెడ్డి మాట్టాడుతూ… ఇండియ‌న్ సినిమాలో ఇంకా చెప్ప‌టానికేం లేవు అన్న‌న్ని క‌థ‌ల‌తో సినిమాలొచ్చాయి. ఐనా కొత్త క‌థ‌లు రాస్తున్నాం కొత్త సినిమాలు తీస్తున్నాం. ఆ ప్ర‌య‌త్నంలోనే పుట్టిన్ప‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఇంజ‌న్‌కాని, ఇంధ‌నం కానీ లేకుండా న‌డుస్తూ, మ‌న‌తో క‌లిసి ప్ర‌యాణిస్తున్న సైకిల్ పేరుని మా సినిమాకి టైటిల్‌గా పెట్టుకుని ఫ‌స్ట్ సీన్‌లోనే దానికి సంబంధించిన ఇంట్ర‌స్టింగ్ లింక్‌తో క్లీన్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ తీశాము.

ఈ చిత్రంలో హీరో, హీరోయిన్స్‌తో పాటు సుద‌ర్శ‌న్‌, అనితాచౌద‌రి, క్యారెక్ట‌ర్స్ మ్యాజి క్ చేస్తాయి. వీళ్ల‌తోపాటు, సూర్య‌, మ‌ధుమ‌ణి న‌వీన్‌నేని, ఆర్ఎక్స్‌100 ల‌క్ష్మ‌ణ్‌, అన్న‌పూర్ణ‌మ్మ జోగీబ్ర‌ద‌ర్స్ కూడా చాలా ఎంట‌ర్‌టైన్ చేస్తారు. కామెడీ జోన‌ర్ సినిమాకి బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీ మ్యాజి క్ యాడ్ ఐతే, ఎంత కొత్త‌గా వుంటుందో, మా చిత్రంతో చూస్తార‌ని తెలిపారు.

త్వ‌ర‌లో టీజ‌ర్‌తోపాటు, ఆడియోరిలీజ్ చేసుకుని ధియేట‌ర్స్‌లోకి రాబోతున్న ఈ సైకిల్ చిత్రానికి నిర్మాత‌లు, పి.రాంప్ర‌సాద్‌, డి.న‌వీన్‌రెడ్డి, స‌హ‌నిర్మాతఃవి.బాలాజీరాజు, కెమెరాఃసిద్ధంమ‌నోహ‌ర్‌, సంగీతంః జి.ఎం.స‌తీష్‌, ఎడిటింగ్ః గ‌డుతూరిస‌త్య‌, ఆర్ట్ఃరామ్‌కుమార్‌, పిఆర్వో శ్రీ, ప‌బ్లిసిటీ డిజైన‌ర్ ఓంకార్ క‌డియం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus