Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో రూపొందిన ‘అ!’ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు మార్క్ కె రాబిన్. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మ్యూజిక్ విషయంలో ప్రశంసలు కూడా అందుకున్నాడు రాబిన్. ఆ తర్వాత చిన్న సినిమా? పెద్ద సినిమా? అనే తేడా బేధం చూపకుండా ప్రతి సినిమాకి తన బెస్ట్ ఇస్తూ వచ్చాడు.

Mark K Robin

కంటెంట్ ఉన్న సినిమాలని తన మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడం మార్క్ కె రాబిన్ స్టయిల్ అని చెప్పాలి.హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన మార్క్ కె రాబిన్ అనతి కాలంలోనే తన సంగీతంతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. పోటీ వాతావరణంలో కూడా తన మార్క్ చతుకుంటూ దూసుకుపోతున్నాడు. తన మ్యూజిక్ తో ఇప్పటికే ఎంతో మందిని ఇంప్రెస్ చేసి అవార్డులు రివార్డులు అందుకున్నాడు రాబిన్‌.

‘మళ్లీ కలుద్దాం’తో సైమా 2017 బెస్ట్ మ్యూజిక్ అవార్డు వచ్చింది. నోయిడా ఫిల్మ్ ఫెస్టివల్‌లో డిలి బిలీకి సైతం అవార్డు వచ్చింది. ‘సూర్యకాంతం’ సినిమాకి గానూ మార్క్ ఇచ్చిన సంగీతానికి మిర్చి మ్యూజిక్‌ వారి నుంచి బెస్ట్ అప్ కమింగ్ కంపోజర్ అవార్డు వచ్చింది. ‘మల్లేశం’ సినిమాలోని ‘నాకు నువ్వని’ పాటకి బెస్ట్ కంపోజర్‌గా మిర్చి మ్యూజిక్ అవార్డ్ లభించింది.

ఐరా అవార్డుల్లో భాగంగా బెస్ట్ మ్యూజిక్ ప్రొడ్యూసర్‌గా మార్క్‌కి గుర్తింపు దక్కింది. ఇప్పటి వరకు ఆయన దాదాపు 20కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు.

‘8AM Metro’తో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టాడు ‘మార్క్’.డెబ్యూ మూవీతోనే అక్కడ కూడా బెస్ట్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ గా ఐరా అవార్డుని కైవసం చేసుకున్నాడు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అతడి ప్రతిభకి తగ్గ పురస్కారాన్ని అందించింది. అలా మెట్టు మెట్టు ఎదుగుతూ వస్తున్న మార్క్ కె రాబిన్‌కి తాజాగా గద్దర్ అవార్డు కూడా లభించడం విశేషంగా చెప్పుకోవాలి. ‘దండోరా’ సినిమాకి అద్బుతమైన మ్యూజిక్ అందించినందుకు గాను మార్క్ కె రాబిన్‌కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌ కేటగిరీలో గద్దర్ అవార్డు లభించింది.

మార్క్ కె రాబిన్ అందించిన పాటలు, సోల్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మరీ ముఖ్యంగా టైటిల్ సాంగ్..వంటివి ‘దండోరా’ ని నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాయి అని చెప్పాలి. మార్క్ కె రాబిన్ కెరీర్‌లో ‘మల్లేశం’లాంటి గొప్ప సినిమాలు ఉన్నాయి. ‘జాంబీ రెడ్డి’, ‘మిషన్ ఇంపాజిబుల్’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి హిట్ సినిమాలు కూడా మార్క్ ఖాతాలో ఉన్నాయి. అన్ని రకాలుగా నిర్మాతలకు అందుబాటులో ఉంటూ చెప్పిన టైంకి టైమ్ కి ఔట్పుట్ ఇస్తూ ఉంటారు మార్క్.

ఇక ‘గద్దర్’ అవార్డు రావడం పై మార్క్ కె రాబిన్ స్పందిస్తూ.. “చిన్నప్పటి నుండి గద్దర్ పాటలు అంటే ఇస్తాం. అవి పాటలు కాదు ఫైర్. ఆయన పాటలు వింటూ పెరిగిన నాకు ఈనాడు గద్దర్ అవార్డు రావడం ఆనందంగా ఉంది.నన్ను ఈ అవార్డుకి ఎంపిక చేసినందుకు గాను తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి, జ్యూరీ మెంబర్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

‘దండోరా’ వంటి మంచి సినిమాకి పనిచేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు మురళీకాంత్, నిర్మాత రవీంద్ర బెనర్జీ గారికి, అలాగే లిరిసిస్ట్, సింగర్స్‌ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus