దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన బాహుబలి కంక్లూజన్ భారతీయ చిత్రాల రికార్డులన్నింటినీ తిరగరాసింది. 1500 కోట్లు వసూలు చేసి దంగల్ సినిమాని దాటుకొని మొదటి స్థానంలో నిలిచింది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 955 కోట్లు వసూలు చేసి రెండో స్థానానికి పరిమితమయింది. అయితే మే 5న చైనాలో దంగల్ రిలీజ్ చేశారు. అక్కడి ప్రజలు ఈ చిత్రానికి ఫిదా అయ్యారు. వసూళ్ల సునామి మొదలయింది. మూడు వారాల్లో 800 కోట్లు రాబట్టి ఔరా అనిపించింది. దీంతో దంగల్ టోటల్ కలక్షన్ 1755 కోట్లకు చేరింది.
బాహుబలి కంక్లూజన్ ని దాటుకొని నంబర్ వన్ స్థానాన్ని కైవశం చేసుకుంది. బాహుబలి ఇప్పటి వరకు 1600 కోట్ల వద్ద ఉంది. దంగల్ ని చేరుకోవాలంటే ఇంకా 150 కోట్లు అవసరమవుతాయి. దంగల్ ని బీట్ చేసే అవకాశం బాహుబలి 2 కి ఉంది. చైనాలో బాహుబలి ఇంకా రిలీజ్ కాలేదు. కానీ అక్కడ బాహుబలి బిగినింగ్ మొదటి పార్ట్ విజయవంతం కాలేదు. అందువల్ల బాహుబలి కంక్లూజన్ కి ఆదరణ ఉండకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బాహుబలి చిత్ర బృందం మాత్రం చైనాలో తమ చిత్రం 500 కోట్లు వసూళ్లు సాదిస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది. ఎవరి మాట నిజమవుతోందో త్వరలోనే తెలియనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.