వైరలవుతున్న రజినీ కొత్త పిక్స్..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దర్బార్’. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయన తార హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో రజినీకాంత్ సరదాగా యూనిట్ తో కలిసి కాసేపు క్రికెట్ ఆడారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు.. ‘ఇది తలైవా ఐపీఎల్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఈ ఫొటోల్లో రజినీకాంత్ తో పాటూ నయనతార కూడా కనిపిస్తుండడం విశేషం.ఈ చిత్రంలో రజినీ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. ఇందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ కాగా మరొకటి కామన్ మ్యాన్ రోల్ కావడం విశేషం. ఇక ఈ చిత్రంలో రజినీకాంత్ కూతురిగా నివేదా థామస్ కూడా నటిస్తుంది. దాదాపు పాతికేళ్ళ తరువాత మళ్ళీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు సూపర్ స్టార్. 2020 సంక్రాంతి టార్గెట్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ‘లైకా ప్రొడక్షన్స్’ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతమండిస్తున్నాడు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus