Dasara Collections: రెండో వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది.. కానీ

  • April 10, 2023 / 01:45 PM IST

నేచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘దసరా’. ‘శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 30న తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సముద్ర ఖని, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కూడా నాని ఫ్రెండ్ గా నటించారు.

మొదటి రోజు ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది.దీంతో మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. రెండో వీకెండ్ కు కూడా మంచి కలెక్షన్లు నమోదు చేసింది. ముఖ్యంగా నైజాంలో ఈ మూవీ పెర్ఫార్మన్స్ బాగుంది.అయితే ఆంధ్రాలో మాత్రం చాలా వరకు తగ్గిపోయాయి. ఒకసారి 11 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 23.90 cr
సీడెడ్ 5.13 cr
ఉత్తరాంధ్ర 4.09 cr
ఈస్ట్ 2.13 cr
వెస్ట్ 1.20 cr
గుంటూరు 2.38 cr
కృష్ణా 1.79 cr
నెల్లూరు 0.88 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 41.50 cr
కర్ణాటక 4.38 cr
తమిళనాడు 0.92 cr
కేరళ 0.45 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.88 cr
ఓవర్సీస్ 10.18 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 59.31 cr (షేర్ )

‘దసరా’ (Dasara) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.47.05 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.47.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.11 డేస్ కంప్లీట్ అయ్యేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.59.31 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కి ఆల్రెడీ రూ.11.81 కోట్ల లాభాలను అందించింది.

రెండో వీకెండ్ ను కూడా ఈ మూవీ బాగానే క్యాష్ చేసుకుంది కానీ నైజాం, ఓవర్సీస్ తప్ప మిగిలిన ఏరియాల్లో ఈ మూవీ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ డల్ గానే ఉంది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus