Dasara Collections: రెండో వారం కూడా ఓకే అనిపించింది కానీ..!

  • April 13, 2023 / 12:33 PM IST

నేచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘దసరా’. ‘శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 30న తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సముద్ర ఖని, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కూడా నాని ఫ్రెండ్ గా నటించారు.

మొదటి రోజు ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది.దీంతో మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. 5 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ రెండో వారం కూడా చాలా బాగా కలెక్ట్ చేసింది. ఒకసారి 2 వీక్స్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 24.82 cr
సీడెడ్ 5.19 cr
ఉత్తరాంధ్ర 4.33 cr
ఈస్ట్ 2.19 cr
వెస్ట్ 1.23 cr
గుంటూరు 2.42 cr
కృష్ణా 2.05 cr
నెల్లూరు 0.90 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 43.13 cr
కర్ణాటక 4.54 cr
తమిళనాడు 0.93 cr
కేరళ 0.45 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.93 cr
ఓవర్సీస్ 10.42 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 61.40 cr (షేర్ )

‘దసరా'(Dasara) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.47.05 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.47.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.2 వారాలు పూర్తయ్యేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.61.4 కోట్ల షేర్ ను రాబట్టింది.బయ్యర్స్ కి ఆల్రెడీ రూ.13.9 కోట్ల లాభాలను అందించింది. ఈ మూవీ సూపర్ హిట్ గా అయితే నిలిచింది కానీ మిగిలిన భాషల్లో ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయలేకపోయింది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus