Dasara Collections: రెండో వీకెండ్ కూడా గట్టిగా కలెక్ట్ చేసేలా ఉంది.!

  • April 8, 2023 / 01:44 PM IST

నేచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘దసరా’. ‘శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 30న తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సముద్ర ఖని, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కూడా నాని ఫ్రెండ్ గా నటించారు.

మొదటి రోజు ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది.దీంతో మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. విడుదలై వారం రోజులు దాటినా ఈ మూవీ ఇంకా బాగా కలెక్ట్ చేస్తుంది.ముఖ్యంగా నైజాంలో..! రెండో వీకెండ్ కు కూడా మంచి కలెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉంది. ఒకసారి 9 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 22.85 cr
సీడెడ్ 5.02 cr
ఉత్తరాంధ్ర 3.97 cr
ఈస్ట్ 2.05 cr
వెస్ట్ 1.17 cr
గుంటూరు 2.37 cr
కృష్ణా 1.71 cr
నెల్లూరు 0.82 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 39.96 cr
కర్ణాటక 4.25 cr
తమిళనాడు 0.90 cr
కేరళ 0.44 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.80 cr
ఓవర్సీస్ 9.85 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 57.20 cr (షేర్ )

‘దసరా'(Dasara) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.47.05 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.47.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.9 డేస్ కంప్లీట్ అయ్యేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.57.2 కోట్ల షేర్ ను రాబట్టింది.బయ్యర్స్ కి ఆల్రెడీ రూ.9.7 కోట్ల లాభాలను అందించింది. రెండో వీకెండ్ కూడా ఈ మూవీ క్యాష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మరి ఎంత వరకు క్యాష్ చేసుకుంటుందో చూడాలి..!

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus