Dasara Teaser: నాని ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం, ఊరమాస్ ఎంటర్‌టైనర్‌గా ‘దసరా’..!

కెరీర్ స్టార్టింగ్ నుండి డిఫరెంట్ కాన్సెప్ట్స్, వెరైటీ క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు నేచురల్ స్టార్ నాని.. వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ మీద విభిన్న తరహా చిత్రాలు తెరకెక్కిస్తూ ప్యాషనేట్ ప్రొడ్యూసర్‌గానూ మారాడు. నాని, కీర్తి సురేష్ జంటగా.. శ్రీకాంత్ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న పక్కా మాస్ ఎంటర్‌టైనర్ ‘దసరా’..

‘నేను లోకల్’ తర్వాత నాని, కీర్తి కలిసి నటిస్తున్న సినిమా ఇది. అలాగే నాని కెరీర్‌లో రూపొందుతున్న ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం కూడా ఇదే కావడం విశేషం.. రీసెంట్‌గా ఐదు భాషల్లో ఐదుగురు స్టార్స్ ‘దసరా’ టీజర్ రిలీజ్ చేశారు. దర్శకధీరుడు రాజమౌళి (తెలుగు), షాహిద్ కపూర్ (హిందీ), ధనుష్ (తమిళ్), రక్షిత్ శెట్టి (కన్నడ), దుల్కర్ సల్మాన్ (మలయాళం) టీజర్స్ రిలీజ్ చేసి టీంకి బెస్ట్ విషెస్ తెలియజేశారు.

టీజర్ విషయానికొస్తే.. ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలినప్పటి నుండే కంప్లీట్ ఊరమాస్ గెటప్‌లో, డీ గ్లామర్‌గా కనిపిస్తూ.. డిఫరెంట్ మేకోవర్‌తో ఆకట్టుకోబోతున్నాడనిపించాడు నాని.. ఇక తెలంగాణ యాసలో పలికిన మాటలు హైలెట్ అయ్యాయి. ‘మందంటే మాకు వ్యసనం కాదు.. అలవాటు పడిన సంప్రదాయం’ అంటూ అలరించాడు. తోట శ్రీనివాస్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. సత్యన్ సూర్యన్ విజువల్స్, సంతోష్ నారయణన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యాయి. మొత్తం టీజర్ అంతా నానినే చూపించి.. ఇది నేచురల్ స్టార్ వన్ మెన్ షో అని హింట్ ఇచ్చారు.

‘డైలాగ్ కింగ్’ సాయి కుమార్, సముద్రఖని, జరీనా వాహబ్, దీక్షిత్ శెట్టి తదితరులు కీలకపాత్రల్లో కనిపించనుండగా.. పాపులర్ మలయాళం యాక్టర్ షైన్ టామ్ చాకో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. చుట్టూ బొగ్గుగనుల మధ్యలో ఉన్న ఈర్లపల్లి అనే గ్రామం, దాని నేపథ్యం చుట్టూ.. అనేక మలుపులతో తిరిగే కథ అని క్లుప్తంగా చూపించారు. ఈ ఏడాది ‘దసరా’ పండుగ నాని ‘దసరా’ సినిమా రూపంలో మార్చిలోనే రాబోతుందని చెప్తూ.. మార్చి 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని అనౌన్స్ చేశారు.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus