దర్శకుడు హరీష్ శంకర్… పవన్ కళ్యాణ్ తో చేస్తున్న రెండో సినిమా … తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తేరి’ చిత్రానికి రీమేకే. అయితే ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్ చూస్తే కొత్తగా ఉంది. ఒరిజినల్ ఛాయలు ఇంత కూడా కనబడలేదు.అది హరీష్ శంకర్ ట్యాలెంట్. పవన్ కళ్యాణ్ ను అభిమానులకి నచ్చినట్టు ఎలా ప్రెజెంట్ చేయాలో అతనికి త్రివిక్రమ్ కంటే కూడా బాగా తెలుసు. గ్లింప్స్ చూసి పవన్ అభిమానులు కూడా హ్యాపీగా ఫీలయ్యారు.
అయితే హరీష్ శంకర్ ను ఇది రీమేకే కదా అని ప్రశ్నిస్తే అతను మాట దాటేశాడు. ఇది రీమేక్ కాదన్నట్టు అతని వాక్చాతుర్యంతో కవర్ చేసాడు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ కి స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేస్తున్న సీనియర్ దర్శకుడు దశరథ్ ఈ విషయం పై ఎప్పుడో క్లారిటీ ఇచ్చేసారు. ఇది ‘తేరి’ కి రీమేకే. కానీ ఆ సినిమా స్ట్రక్చర్ తీసుకుని, చాలా మార్పులు చేశాం.
ఇది కచ్చితంగా పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ నచ్చేలా హరీష్ డిజైన్ చేస్తున్నాడు’ అంటూ ఇది వరకే దశరథ్ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు తన ‘లవ్ యు రామ్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి మరోసారి స్పందించాడు. ‘ఇది రీమేక్ అనే మాట నిజమే. కానీ హరీష్ 90 శాతం మార్పులు చేసాడు. ‘దబాంగ్’ ‘జిగర్తాండ’ సినిమాల పాయింట్లు తీసుకుని ఏ విధంగా అయితే ‘గబ్బర్ సింగ్’ ‘గద్దలకొండ గణేష్’ వంటి హిట్లు ఇచ్చాడో..
అదే విధంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని కూడా తీర్చిదిద్దుతున్నాడు. అసలు రీమేక్ సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ ఎవ్వరికీ రాదు’ అంటూ దశరథ్ చెప్పుకొచ్చాడు. దశరథ్ నిర్మాణంలో రూపొందిన ‘లవ్ యు రామ్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా (Dasaradh) దశరథ్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.