‘పవన్’ పై దాసరి సంచలన వ్యాఖ్యలు!!!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మెగా కుటుంభానికి, దాసరికు మధ్య ఎప్పటినుంచో మాటల యుద్దం జరుగుతూ వస్తుంది. దీనిపై అనేక సంధర్భాల్లో ఎన్నో సార్లు ఒకరిపై మరొకరు మాటలతో దాడి సైతం చేసుకున్నారు. అయితే చిరు పొలిటికల్ కరియర్ మొదలు పెట్టి సినిమాలకు దూరమైనప్పటినుంచి ఈ గొడవ కాస్త సర్దుమణిగింది అని టాలీవుడ్ లో వినిపిస్తున్న వాదన. ఇక మరో పక్క దాసరి మాత్రం అవకాశం వచ్చిన ప్రతీ సారి మెగా ఫ్యామిలీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం పై షాకింగ్ కామెంట్స్ చేసాడు ఈ సీనియర్ దర్శకుడు.

విషయంలోకి వెళితే…శ్రీకాంత్ తాజా చిత్రం ‘మెంటల్ పోలీస్’ ట్రైలర్ లాంచ్ కి ముఖ్య అతిధి గా విచ్చేసిన దాసరి సర్దార్ చిత్రం పై కాంట్రొవర్షియల్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ…ఈ మద్య చాలా మంది కథను కాకుండా ఇమేజ్ ని నమ్ముతున్నారని.. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు తప్ప కధలో కంటెంట్ ఉండడం లేదు అని పవన్ ను టార్గెట్ చేశాడు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి భారీ భారీ సెట్లు వేసినా, విదేశాల్లో పాటలు చిత్రీకరణలు చేసినా, విజువల్ ఎఫెక్ట్స్ బ్రహ్మాండంగా చూపించినా, ప్రమోషన్స్ భారీగా చేసినా, కధను పట్టించుకోకపోతే తిప్పలు తప్పవు అని ఆయన తెలిపారు. ఇక అదే క్రమంలో టాలీవుడ్ లో ఇటీవల కాలంలో ఎక్కువ మొత్తం పెట్టి తీసి కూడా ఫ్లాప్ గా నిలిచిన చిత్రం ఏమైనా ఉందా అంటే అది ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం మాత్రమే అని దాసరి అన్నారు. సినిమాను నిర్మించే ముందు మంచి కదను ఎన్నుకుని, దానికి తగ్గ బడ్జెట్ లో సినిమా తీసుకుని ఉంటే మంచి ఫలితాలు వస్తాయి అని దాసరి తెలుపడం విశేషం. మరి దీనిపై పవన్ శిబిరం ఏమంటుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus