The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్'(The RajaSaab) సినిమా నిన్న అంటే జనవరి 9న రిలీజ్ అయ్యింది. ప్రీమియర్ షోలు హడావిడిగా పడ్డాయి. వాటికి నెగిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. సినిమా చూసిన చాలా మంది ‘ది రాజాసాబ్’ సినిమా అట్టర్ ప్లాప్ అంటూ నెగిటివ్ కామెంట్లు చేశారు. దర్శకుడు మారుతీని అయితే తిట్టిపోశారు. ఇంకొంతమంది అయితే మారుతీ చెప్పిన కొల్లా లగ్జురియా విల్లా నెంబర్ 7 వద్దకు వెళ్లి.. హడావిడి చేశారు. ఇలాంటి రెస్పాన్స్ వస్తే.. ఎంత పెద్ద సినిమా అయినా మార్నింగ్ షోకి దుకాణం సర్దేయాలి.

The RajaSaab

కానీ ‘ది రాజాసాబ్’ సినిమా టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ట్రేడ్ అంచనాల ప్రకారం ఈ సినిమా మొదటి రోజు రూ.85 కోట్లు గ్రాస్ ను ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేస్తుంది అని అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా.. ఆ అంచనాలను మించి ఏకంగా రూ.100.90 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి రికార్డు కొట్టింది. అది పూర్తిగా ప్రభాస్ స్టార్ పవర్ మ్యాజిక్ అనే చెప్పాలి.

అయితే 2వ రోజు ఈ సినిమా ఎలా హోల్డ్ చేస్తుంది అనే ఆసక్తి చాలా మందిలో ఉంది. ఎందుకంటే 2వ కలెక్షన్స్ ను బట్టే.. ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేదానిపై ఓ అంచనాకి రాగలం.ఈ నేపథ్యంలో ట్రేడ్ పండితుల సమాచారం మేరకు.. ‘ది రాజాసాబ్’ 2వ రోజు రూ.21 కోట్ల వరకు షేర్ ను రాబట్టే అవకాశాలు ఉన్నాయట. అది కూడా మ్యాట్నీల వరకు చేసిన ట్రాకింగ్. ఈవెనింగ్ అండ్ నైట్ షోలు ఇంకా పెరగొచ్చు. కానీ ఎంత వరకు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

ఏదేమైనా రెండో రోజు రూ.20 కోట్ల షేర్ మార్క్ ను దాటితే గొప్ప విషయమే. ఎందుకంటే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఓ సినిమా 2వ రోజు ఈ రేంజ్లో హోల్డ్ చేయడం కూడా గొప్ప విషయమే.

‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus