మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘మనశంకర వరప్రసాద్ గారు'(Mana ShankaraVaraprasad Garu). ‘పండగకి వస్తున్నారు’ అనేది ఈ సినిమా క్యాప్షన్. ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది ఈ చిత్రం. ఆ తర్వాత వచ్చిన టీజర్,మీసాల పిల్లా సాంగ్, శశిరేఖ సాంగ్, మెగా విక్టరీ మాస్ సాంగ్, హుక్ స్టెప్ సాంగ్, ట్రైలర్ వంటివి విశేషంగా ఆకట్టుకున్నాయి.
దీంతో సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ క్రేజ్ దృష్ట్యా జనవరి 11 నైట్ నుండే ప్రీమియర్ షోలు వేయడానికి రెడీ అయ్యారు మేకర్స్. ఇదిలా ఉండగా.. ఆల్రెడీ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాని ఇండస్ట్రీలో ఉన్న దిల్ రాజు వంటి కొంతమంది పెద్దలతో పాటు చిరుకి అత్యంత సన్నిహితులు అయినటువంటి వారు వీక్షించడం జరిగింది.
సినిమా చూసిన అనంతరం వారు తమ అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు.వారి టాక్ ప్రకారం.. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా నిడివి 2 గంటల 44 నిమిషాల నిడివి కలిగి ఉందట. సినిమా స్టార్టింగ్లో చిరు ఎంట్రీ సీన్ అదిరిపోయిందట. అక్కడ యాక్షన్ తో పాటు కామెడీ కూడా బాగా పండింది అంటున్నారు. అటు తర్వాత వచ్చే హుక్ స్టెప్ సాంగ్ కూడా ఆడియన్స్ ని కట్టిపడేస్తుందట. ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ సినిమాలో హీరోయిన్ విజయశాంతి పేరు శశిరేఖ.
ఆ పేరుని ఈ సినిమాలో హీరోయిన్ నయనతారకి పెట్టారట. అలాగే ‘చంటబ్బాయ్’ లో సుహాసిని పేరు జ్వాల. అదే పేరుని ఈ సినిమాలో చిరు అసిస్టెంట్ అయిన కేథరిన్ పాత్రకి పెట్టారట. అలాగే ముఠామేస్త్రిలో విలన్ శరత్ సక్సేనా కూడా ఇందులో కీలక పాత్ర చేశారట. ఇలాంటి నోస్టాలజిక్ ఎలిమెంట్స్ ఎన్నో సినిమాలో ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా క్లైమాక్స్ లో వచ్చిన వెంకటేష్ పాత్ర కూడా హైలెట్ గా నిలుస్తుంది అంటున్నారు. మరి ప్రీమియర్ షోలతో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.