శివకార్తికేయన్ ల్యాండ్ మార్క్ మూవీగా ‘పరాశక్తి'(Parasakthi) అనే పీరియాడిక్ మూవీ రూపొందింది. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జయం రవి అలియాస్ రవి మోహన్ ప్రతినాయకుడిగా నటించారు.మరో హీరో అథర్వ మురళి కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. ఆ రకంగా ఈ ప్రాజెక్టు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అయితే సెన్సార్ విషయంలో సినిమాకి చాలా సమస్యలు ఎదురయ్యాయి. రిలీజ్ విషయంలో కూడా చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి.
కానీ ఆ ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఈరోజు అనగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది. సినిమా చూసిన కొంతమంది ట్విట్టర్లో నెగిటివ్ గా స్పందించడం గమనార్హం.వారి టాక్ ప్రకారం.. ఇది ఒక బోరింగ్ పీరియాడిక్ డ్రామా అని, హానెస్ట్ అటెంప్ట్ అని, కానీ స్క్రీన్ ప్లేలోని సాగదీత వల్ల ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుందని చెబుతున్నారు. మొదటి 15 నిమిషాలు బాగుంటుందట.
ఆ వరల్డ్ లోకి ఆడియన్స్ ని తీసుకెళ్లడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడట. కానీ ఆ తర్వాత బోరింగ్ లవ్ ట్రాక్ విసిగిస్తుందట. ఇంటర్వెల్ తర్వాత మరింత స్లోగా కథనం సాగుతుందని, ఏ దశలోనూ కోలుకోలేదని అంటున్నారు. దర్శకురాలు సుధాకొంగర రైటర్ గా మంచి పాయింట్ తీసుకున్నప్పటికీ ఎగ్జిక్యూషన్ విషయంలో డైరెక్టర్ గా ఫెయిల్ అయ్యింది అంటున్నారు. శివ కార్తికేయన్ ఎప్పటిలానే బాగా పెర్ఫార్మ్ చేశాడట.
జయం రవి పాత్ర విషయంలో బ్యాక్ స్టోరీ మిస్ ఫైర్ అయ్యింది అని చెబుతున్నారు. ఆర్ట్ డైరెక్టర్ వర్క్ బాగుందట. కానీ మ్యూజిక్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదని విమర్శిస్తున్నారు. అది ‘పరాశక్తి’ ట్విట్టర్ టాక్.