వైరల్ అవుతున్న డేవిడ్ – రష్మికల వీడియో..!

  • November 15, 2022 / 06:37 PM IST

సోషల్ మీడియా.. ఈరోజుల్లో సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు అందరి జీవితాల్లో ఒక భాగమైపోయింది.. పిక్స్, వీడియోస్, రీల్స్.. ఇలా వాడుకున్నోడికి వాడుకున్నంత అన్నట్టు అన్నమాట.. దీని వల్లే చాలామంది నార్మల్ పీపుల్ సెలబ్స్ అయిపోయారు. ఇక ప్రముఖులు కూడా కాస్త రిలాక్సేషన్ కోసం సోషల్ మీడియాలో లైవ్ చాట్, రీల్స్ పోస్ట్ చేయడం లాంటివి చేస్తుంటారు.. కట్ చేస్తే గతకొద్ది కాలంగా సినిమా పాటలు, డైలాగులు చెప్తూ డబుల్ పాపులర్ అయిపోతున్నారు. కేవలం స్టార్స్ మాత్రమే కాదు.. క్రికెటర్స్, పొలిటిషియన్స్ కూడా సందడి చేస్తుంటారు..

క్రికెటర్లలో డేవిడ్ వార్నర్ అందరికంటే ముందుంటాడు.. ఇప్పటికే ఎన్నో డబ్ స్మాష్‌లు, పాటలు, డైలాగులతో రచ్చ రంబోలా చేశాడు.. అంతేనా సపరేట్ ఫ్యాన్ బేస్‌ని కూడా సంపాదించుకున్నాడు. ఇప్పుడు మనోడు రీసెంట్‌గా షేర్ చేసిన ఓ వీడియో మాత్రం పిచ్చ వైరల్ అవుతోంది. ఈసారి హీరోలను వదిలేసి హీరోయిన్ సాంగ్‌కి కాలు కదిపాడు.. కన్నడ చిన్నది రష్మిక మందన్నా మీద మనసు పడ్డట్టున్నాడు డేవిడ్.. దాంతో ‘భీష్మ’ మూవీలో రష్మిక గెటప్‌లోకి మారిపోయి అరిపించేశాడు..

వెంకీ కుడుముల డైరెక్షన్లో.. నితిన్, రష్మిక జంటగా నటించిన ‘భీష్మ’ చిత్రంలోని ‘వాటే బ్యూటీ’ పాటలో రష్మిక వేసిన మూమెంట్స్ యూత్‌కి బాగా నచ్చేశాయి. ఇక రష్మిక ముఖాన్ని తన ముఖంలా మార్చి ఎడిట్ చేశాడు వార్నర్ బ్రో. ‘‘ఈ వీడియో చేసినందుకు సో సారీ.. నీక్కూడా సారీ రష్మిక’’ అని కామెంట్స్తూచేస్తూ.. రష్మికని ట్యాగ్ చేశాడు. వార్నర్ వెర్షన్ ‘వాటే బ్యూటీ’ చూసి నెటిజన్లు, సెలబ్రిటీలు షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్‌కి గురవడమే కాక బీభత్సంగా నవ్వుకుంటున్నారు కూడా..

ఇంతకుముందు ‘పుష్ప’, ‘సర్కారు వారి పాట’, ‘ఆచార్య’ సినిమాలకు సంబంధించిన ఫేస్ ఎడిట్ వీడియోస్ కోసం చిరు, మహేష్, అల్లు అర్జున్‌లా మారిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం డేవిడ్ – రష్మికల వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. వార్నర్ ‘భీష్మ’ స్టెప్స్ గురించి రష్మిక ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి మరి..

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus