DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’
- August 13, 2026 / 07:24 PM ISTByPhani Kumar
ఖైదీ, విక్రమ్ లాంటి కల్ట్ సినిమాలతో స్టార్ దర్శకుడిగా ఎదిగాడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj). టాలీవుడ్‌లోనూ అతడికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే.. లోకేష్ కనగరాజ్ హీరోగా మారుతూ ‘డిసి'(DC) అనే సినిమా చేశాడు. వామికా గబ్బి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించాడు. అనిరుధ్ సంగీత అందించాడు. ‘సన్ పిక్చర్స్’ సంస్థ నిర్మించిన ఈ సినిమాని నిర్మించింది. ఆగస్టు 7న తెలుగుతో పాటు తమిళంలో కూడా ఏక కాలంలో విడుదలైంది ఈ సినిమా.
DC Collections

మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో మంచి వసూళ్లు వచ్చాయి.వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా వీక్ డేస్ లో కూడా బ్రహ్మాండంగా కలెక్ట్ చేస్తుంది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 2.20 cr |
| సీడెడ్ | 0.53 cr |
| ఆంధ్ర(టోటల్) | 2.06 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 4.79 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా(తెలుగు వెర్షన్) | 0.15 cr |
| ఓవర్సీస్(తెలుగు వెర్షన్) | 0.18 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 5.12 cr(షేర్) |
‘డిసి’ చిత్రం తెలుగు వెర్షన్ కి రూ.2.5 కోట్ల వరకు ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా రూ.5.12 కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించింది. గ్రాస్ పరంగా ఆల్మోస్ట్ రూ.9.02 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.2.12 కోట్ల లాభాలు బయ్యర్స్ కి అందించింది.














