Spirit: ‘స్పిరిట్’ నుండి దీపికాని అందుకే తీసేస్తున్నాడా..!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga).. ముక్కుసూటిగా పోయే మనిషి. ఏది ఉన్నా మొహం పైనే చెబుతాడు. ఎలాంటి కాంట్రోవర్సీలకి భయపడడు. సంజాయిషీలు చెప్పడు. ప్రభాస్ (Prabhas)  వంటి స్టార్ అయినా సరే సందీప్ తో సినిమా చేస్తున్నప్పుడు పూర్తిగా అతని రూల్స్ ఫాలో అవ్వాలనుకునే రకం. అలాంటి వ్యక్తి దగ్గర లేనిపోని గొప్పలకు పోతే సహిస్తాడా. దీపిక విషయంలో అదే జరిగింది. విషయం ఏంటంటే.. ‘స్పిరిట్’ లో (Spirit) దీపిక పదుకోనెని (Deepika Padukone) హీరోయిన్ గా అనుకున్నాడు సందీప్.

Spirit

అయితే ఇప్పుడు ఆమెను తప్పించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. దీపిక పెట్టిన కండిషన్లు కూడా అలా ఉన్నాయి. ఆమె షూటింగ్ కి టైంకి రాదు. చెప్పిన టైంకి ఎంత కాదనుకున్నా గంట, 2 గంటలు ఆలస్యం చేస్తుంది. పారితోషికంతో పాటు లాభాల్లో వాటా కూడా కోరుతుంటుంది.సందీప్ రెడ్డి వంగా సినిమా విషయంలో కూడా ఇవే డిమాండ్లు. అంతేకాదు కాల్షీట్ అంటే స్టార్స్ కి మినిమమ్ 8 గంట‌లు పనిచేయాలి.

దీపిక పదుకోనె మాత్రం 6 గంట‌ల్లో తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేయాలని షరతులు పెడుతుందట. మిగిలిన సమయం కేటాయించాలంటే పారితోషికం అదనంగా చెల్లించాలని కోరిందట. ఇవన్నీ కాకుండా ఆమె టీం ఖర్చులు అదనం. అందుకే సందీప్ కి చికాకు వచ్చేసిందట. అతనికి ‘ఇది నా సినిమా’ అనుకుని పనిచేసేవాళ్ళు కావాలి.

‘నేను పని చేయను కానీ లాభాల్లో వాటా కావాలి’ అంటే ఊరుకుంటాడా. అందుకే దీపికని ‘స్పిరిట్’ నుండి తప్పించేసి వేరే హీరోయిన్ ను.. అవసరమైతే ఓ కొత్త హీరోయిన్ ను తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట సందీప్. ప్రభాస్- సందీప్ కాంబో అంటే అందమైన హీరోయిన్ ఉంటే సరిపోతుంది… స్టార్ హీరోయినే కావాలనే రూల్ లేదు. ఇది సందీప్ కి అర్థమైంది. అదీ మేటర్..!

భారీ పొలిటికల్ స్కాం లో ఇరుక్కున్న క్రేజీ హీరోయిన్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus