2021 లోనే కెరీర్ మొదలుపెట్టినప్పటికీ.. సరైన గుర్తింపు మాత్రం 2025లో వచ్చింది. ఈ నాలుగేళ్ల ప్రయాణంలో రానన్ని ఆఫర్లు “డ్రాగన్” (Return of the Dragon) సినిమా తర్వాత క్యూ కట్టాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కయాడు లోహర్ (Kayadu Lohar ) మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఆల్రెడీ విశ్వక్ సేన్(Vishwak Sen), శింబు (Silambarasan) లాంటి హీరోలతో సినిమాలు చేస్తుంది. అవి కాకుండా మరికొన్ని సినిమాలకు ఆమె పేరు పరిశీలనలో ఉంది. అసలు ఇలాంటి సమయంలో ఆమె కెరీర్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన తరుణం.
అలాంటిది కయాడు పేరు ఇప్పుడు ఒక పొలిటికల్ స్కామ్ లో గట్టిగా వినిపిస్తోంది. తమిళనాడుకు చెందిన టాస్కామ్ స్కాంలో కయాడు కూడా భాగస్వామి అయినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ స్కాం జరిగే క్రమంలో కొంతమంది రాజకీయ నాయకులకు ఏర్పాటు చేసిన నైట్ పార్టీస్ లో కయాడు షో రన్నర్ గా ఉండేదని, అందుకోసం ఆమె దాదాపు 35 లక్షల రూపాయలను ఫీజుగా అందుకుందని ఈడీ ఆమె పేరును రిపోర్ట్ లో యాడ్ చేసినట్లు తెలుస్తోంది.
దాంతో కయాడు ఒక్కసారిగా పొలిటికల్ ఫిగర్ అయిపోయింది. అన్ని రాజకీయ పార్టీలు ఆమెను టార్గెట్ చేయడం, ఆమెను మీమ్స్ లో వాడుకోవడం, పొలిటికల్ పేజీల్లో ఆమె ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. దాంతో సినిమాల్లో పాపులర్ అవ్వాల్సిన కయాడు ఇప్పుడు పొలిటికల్ ఫిగర్ అయిపోయింది.
అయితే.. ఈ కేసులో ఆమె ఇన్వాల్వ్ అయినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. సో, కయాడు & టీమ్ కాస్తా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం లాంటిది ఏమైనా చేస్తే బెటర్. లేకపోతే.. ఆమె కెరీర్ కి ఇదొక పెద్ద సమస్యగా మారి, ఉన్న సినిమాల నుంచి తప్పుకోవాల్సిన లేదా తప్పించాల్సిన పరిస్థితి ఎదురైనా ఏం చెప్పలేం.