Deepika Padukone: దీపికాను బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ చేయించుకోమన్నారట!

ఫామ్ లో ఉన్న హీరోయిన్లపై ట్రోలింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. కానీ మన తారలు వాటిని పెద్దగా పట్టించుకోరు. అయితే అలాంటి ట్రోలింగ్స్ లో కొన్ని బాధించే సలహాలు, విమర్శలు కూడా ఉంటాయి. మరీ ముఖ్యంగా బాడీ షేమింగ్ కామెంట్స్ హీరోయిన్లను బాగా ఇబ్బంది పెడుతుంటాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ కి కూడా బాడీ షేమింగ్ కామెంట్స్ తప్పలేదట. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది దీపికా పదుకోన్.

తన బ్రెస్ట్ సైజు పెంచుకోమంటూ ఓ వ్యక్తి తనకు సలహా ఇచ్చాడని చెప్పుకొచ్చింది దీపికా. ఆ సమయంలో తనకు చాలా కోపం వచ్చిందని.. కానీ ఆ ఘటనను తను చాలా త్వరగా మర్చిపోయానని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ఆమె నటించిన ‘గెహరాయియా’ సినిమా ఇటీవల ఓటీటీలో విడుదలైంది. ఆ సినిమా ప్రమోషన్ కోసం వరుసగా ఆమె ఇంటర్వ్యూల్లో పాల్గొంటూనే ఉంది. ఇందులో భాగంగా జీవితంలో ఎదురైనా అతి చెత్త సలహా ఏంటంటూ దీపికా పదుకోన్ ను ప్రశ్నించారు ఓ జర్నలిస్ట్.

దీనికి సమాధానంగా ఆమె.. తన ఎద సైజు పెంచుకోమంటూ వచ్చిన సలహానే అతి చెత్త సలహాగా పేర్కొంది. అయితే ఆ సలహా ఇచ్చింది ఎవరనే విషయాన్ని మాత్రం దీపికా చెప్పలేదు. స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ను తన జీవితంలో బెస్ట్ సలహా ఇచ్చిన వ్యక్తిగా పేర్కొంది. తెలిసినవాళ్లతో సినిమాలు చేయమని షారుఖ్ సూచించాడట. సినిమాలు చేయడమంటే కేవలం నటించడం కాదని.. జీవితంలో ఓ భాగమని.. కాబట్టి కొన్ని జ్ఞాపకాల్ని, అనుభవాలను పొందే క్రమంలో తెలిసిన వాళ్లతో ట్రావెల్ చేయడమే మంచిదని షారుఖ్ తనకు చెప్పినట్లు దీపికా వివరించింది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus