Deepika Padukone: దీపికకు ఆ టాలీవుడ్ హీరో ఛాన్స్ ఇస్తారా?

గత కొన్నేళ్లుగా బాలీవుడ్ ఇండస్టీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను కొనసాగిస్తున్న హీరోయిన్లలో దీపికా పదుకొనే ఒకరనే సంగతి తెలిసిందే. దీపికా పదుకొనే 2018 సంవత్సరంలో ప్రముఖ నటులలో ఒకరైన రణవీర్ సింగ్ ను వివాహం చేసుకున్నారు. పెళ్లైన తర్వాత కూడా వరుస సినిమాలలో నటిస్తూ దీపిక కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. రోజులో ఎంత సమయం బిజీగా ఉన్నప్పటికీ దీపిక కుటుంబంతో కలిసి గడపటానికి కొంత సమయం కేటాయిస్తారు.

అయితే ఫేవరెట్ హీరో ఎవరనే ప్రశ్నకు దీపిక తన భర్త పేరు చెప్పకుండా టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు పేరును చెప్పారు. మహేష్ బాబు తన ఫేవరెట్ హీరో అయినప్పటికీ మహేష్ బాబును ఇప్పటివరకు కలవలేదని దీపిక వెల్లడించడం గమనార్హం. భవిష్యత్తులో మహేష్ కు జోడీగా నటించే ఛాన్స్ వస్తే మాత్రం దీపిక ఆ ఆఫర్ కు నో చెప్పే అవకాశం దాదాపుగా లేనట్టేనని తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా దీపికా పదుకొనే నటిస్తున్నారు. మహేష్ దీపిక కాంబినేషన్ లో భవిష్యత్తులో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది. మహేష్ రాజమౌళి కాంబో సినిమాకు హీరోయిన్ ఇంకా ఫిక్స్ కాలేదనే సంగతి తెలిసిందే. మహేష్ ఫేవరెట్ హీరో అని చెప్పడంతో రాజమౌళి దీపిక పేరును పరిశీలిస్తారేమో చూడాల్సి ఉంది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus