‘రాబ్తా’ లో దీపికా ఐటెమ్ సాంగ్..
- May 23, 2016 / 03:25 PM ISTByFilmy Focus
‘బాజీరావ్ మస్తానీ’ చిత్రం తరువాత వీన్ డీజిల్ సరసన ‘ట్రిపుల్ ఎక్స్’ చిత్రంలో నటిస్తూ హాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది దీపికా పదుకొనే. ఈ చిత్రం ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసుకోవడంతో తిరిగి బాలీవుడ్ చేరుకుంది దీపికా. ప్రస్తుతం ఆమె కొత్త చిత్రాలను అంగీకరించక పోయినప్పటికీ.. కబీర్ ఖాన్ తెరకెక్కించనున్న చిత్రంలో సల్మాన్ సరసన, సంజయ్ లీలా బన్సాలీ రాణి పద్మావతి చిత్రంలో ఆమె నటించనుందని వార్తలు వినవస్తున్నాయి. మరోవైపు ఆమె ‘రాబ్తా’ చిత్రంలో ఓ ప్రముఖ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. చిత్ర దర్శకుడు దినేష్ విజన్ కు దీపికా సన్నిహితురాలని అందుకే ఆమె ఈ చిత్రం లో ఐటెమ్ సాంగ్ లో కూడా నటిస్తోందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సుశాంత్ రాజ్ పుత్, కృతి సనన్ లు జంటగా నటిస్తున్న ఈ చిత్రం 2017 ఫిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












