బిగ్ బాస్ ఈ వారం బీబీ హోటల్ టాస్క్ ఇవ్వగా.. అందులో షణ్ముఖ్, సన్నీల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని గేమ్ ఆడుతున్నావ్ అంటూ షణ్ముఖ్ పై సన్నీ రెచ్చిపోయాడు. ఈ విషయంపై షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనా మండిపడింది. ”చేతగాని ఆటలు ఆడుతున్నాడు ఏంటి..? ఫిజికల్ అయ్యి గట్టి గట్టిగా అరిస్తే గేమ్ ఆడినట్లా..? ఫిజికల్ అవ్వడం కన్నా కష్టం అయిన టాస్క్ మైండ్‌తో ఆడటం. అది షన్ను వంద శాతం ఇస్తున్నాడు. బిగ్‌బాస్ చూశాక తన మీద ప్రేమ మరింత పెరిగింది.
ఎంత మెచ్యూర్‌గా బిహేవ్ చేస్తున్నాడు. సపోర్ట్‌గా నిల్చుంటే ఆడవాళ్లని అడ్డుపెట్టుకొని గేమ్ ఆడినట్లా..? మరి నీకు కాజల్, మానస్ సపోర్ట్ చేసినప్పుడు ఏమైంది..?నువ్వు ఎలా ఉండాలో మిగతా వాళ్లుకూడా అలానే ఉండాలా ఏంది..?” అంటూ రాసుకొచ్చింది. ”నువ్ బెస్ట్ అనుకో తప్పులేదు.. కానీ వేరే వాళ్లను తక్కువ చేసి చూడకు. నీలా ఇంకొకరు ఉండలేరు.. ఇంకొకరిలా నువ్ ఉండలేవు. యూట్యూబ్ వరకే గుర్తుపెట్టుకోనా..? ఈ స్టేజ్ వరకు వచ్చాడంటే ఎంత కష్టపడి వచ్చాడని..
సంతోష పడకుండా అలాంటి మాటలు అనడం తప్పు సన్నీగారు.. మీరు రా అంటేనే పడలేకపోయారు. మరి మీరే అన్నన్ని మాటలు అంటే ఎలా..?” అంటూ ఏకిపారేసింది. దీప్తి రాసిన ఈ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షణ్ముఖ్ గేమ్ ని పొగిడిన.. ‘తప్పు అయితే నేర్చుకుంటాం రా బై అని ఎంత బాగా చెప్పావ్ షణ్నూ..నిన్ను హగ్ చేసుకోవాలనుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!