బెల్లంకొండ సినిమా రెడీ కాలేదా..?

  • January 9, 2021 / 12:41 PM IST

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 15న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇప్పుడు రిలీజ్ డేట్ ఒకరోజు ముందుకు జరిగే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఇంకా బాకీ ఉందనేది లేటెస్ట్ వార్త. ఓ పాట మినహాయించి షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ పాట షూటింగ్ జరిపిస్తున్నారు.

రేపటితో షూటింగ్ పూర్తవుతుంది. ఆ తరువాత ఎడిటింగ్, ఫైనల్ మిక్సింగ్, డీఐ ఇలా చాలా పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అవన్నీ పూర్తి చేసి చెప్పిన టైమ్ కి రిలీజ్ చేయాలి. ఇవన్నీ ఎప్పటికి అవుతాయో మరి. నిజానికి ఈ పాత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సివుంది. కానీ ఇటీవల షూటింగ్ కోసం కశ్మీర్ వెళ్లిన చిత్రబృందం అక్కడ అనుకోకుండాస్ట్ర‌క్ అయిపోయింది. తిరిగి హైదరాబాద్ రావడానికి ఫ్లైట్స్ లేక ఇబ్బంది పడ్డారు.

సకాలంలో హైదరాబాద్ కి చేరుకోలేకపోయారు. ఫైనల్ గా ఇబ్బందులన్నీ దాటుకొని శుక్రవారం నాడు యూనిట్ హైదరాబాద్ కి చేరుకుంది. అప్పటికే సెట్ రెడీగా ఉండడంతో వెంటనే బాకీ ఉన్న పాట షూటింగ్ ని మొదలుపెట్టారు. ఈ సినిమాలో నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus