లాంఛింగ్‌ ఎపిసోడ్‌లో కేక పుట్టించిన యూట్యూబ్‌ స్టార్‌!

బిగ్‌బాస్‌ సీజన్‌ 4 ప్రారంభమవుతుంది అనగానే… అందరి నోట వినిపించిన మాట ఈ సారి ఎవరెవరు వెళ్తారు. ఈ సారి కూడా ఈ మాట వినిపించింది. తొలుత ఒకరిద్దరి పేర్లు గట్టిగా వినిపించినా ఎక్కువ మంది నోళ్లల్లో నానిన పేరు అలేఖ్య హారిక. ఇలా చెబితే మీకు గుర్తుకురావడం చాలా కష్టం కానీ. ‘దేత్తడి’ హారిక అంటే ‘ఆమెనా నాకెందుకు తెలియదు’ అంటారు. అంతలా యూట్యూబ్‌ స్టార్‌గా ప్రజల మనసుల్లోకి వెళ్లిపోయింది.

ఆ హారిక అసలు పేరు అలేఖ్య హారిక. ఇప్పుడు బిగ్‌బాస్‌ షోతో మీ ఇళ్లలోకి ఈ రోజు నుంచి వచ్చేస్తోంది. లాంఛింగ్‌ ఎపిసోడ్‌లో హాట్‌ సాంగ్‌తో.. హాటెస్ట్‌ పర్‌ఫార్మెన్స్‌తో హాట్‌ఫేవరేట్‌ లిస్ట్‌లో నేనున్నాను అని చెప్పకనే చెప్పింది. అందుకేనేమో ప్రేక్షకులు కూడా ఈసారి హారిక అదరగొడుతుంది అని పక్కాగా చెబుతున్నారు. అంతలా హైప్‌ తెచ్చుకున్న హారిక లాంఛింగ్ ఎపిసోడ్‌లో తన గురించి, తన ఎంట్రీ గురించి, అభిమానుల గురించి, కుటుంబ సభ్యుల గురించి చాలా విషయాలు చెప్పింది.

ఆఫీసు వాళ్లు పేరు పెట్టారు

నా పేరు వినగానే ముందు దేత్తడి అని ఎలా వచ్చింది అని అడుగుతుంటారు. అసలు ఆ పేరు పెట్టింది మా ఆఫీసు వాళ్లు. నేను మామూలుగానే హుషారుగా ఉంటాను. ఇక వీడియోలు అంటే ఆ హుషారు రెట్టింపు అవుతుంది. అందుకే మా ఆఫీసువాళ్లు నా పేరు ముందు దేత్తడి అని యాడ్‌ చేశారు. అలా నేను చేసిన వీడియోలను మంచి రెస్పాన్స్‌ వచ్చింది. నా యూట్యూబ్‌ ఛానల్‌కి ఒక మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. ఇప్పటివరకు నా వీడియోలకు 22 కోట్ల వ్యూస్‌ వచ్చాయి. మా వీడియోలను ప్లానింగ్‌ లాంటి పెద్ద పెద్ద ఆలోచనలు ఉండవు. నార్మల్‌ నెటిజన్స్‌కి ఎలాంటి వీడియోలు నచ్చుతాయో చూసి.. అలాంటివే చేస్తాం.

అన్నీ చూసేశా…

బిగ్‌బాస్‌కు నేను చాలా పెద్ద ఫ్యాన్‌. తెలుగులోకి రాకముందు నుంచే బిగ్‌బాస్‌ చూసేదాన్ని. కార్టూన్స్‌ కంటే బిగ్‌బాసే ఎక్కువ చూసేదాన్ని. అది మా అమ్మ వల్ల వచ్చింది. మా అమ్మ జ్యోతి అన్ని భాషల్లో బిగ్‌బాస్‌ చూసేది.. నాకు చూపించేది. అలా చిన్నప్పుడు బిగ్‌బాస్‌కి అలవాటుపడ్డా. అలా అలా నేనూ బిగ్‌బాస్‌కి వెళ్లాలి అనుకునేంతగా ఇష్టం పెరిగిపోయింది. మరోవైపు మా అమ్మ ‘ఇదంతా నిజంగా జరుగుతుందా’ అని అడుగుతుండేది. ఇక నాకు బిగ్‌ బాస్‌ ఆఫర్‌ వచ్చింది అనేసరికి మా అమ్మ ఆనందానికి హద్దుల్లేవు. ‘ఇప్పుడే ఇంటి నుంచి వెళ్లిపో.. బిగ్‌బాస్‌లోకి వెళ్లిపో’ అనేది. చాలా రోజుల నుంచి వేరేవాళ్లను బిగ్‌బాస్‌లో చూసేది కదా… నేను వెళ్తాను అనేసరికి ఆనందం ఆగలేక తెగ సందడి చేసేసింది.

నాగ్‌ అభినందన

హారికను అంతగా ప్రోత్సహించి బిగ్‌బాస్‌కు పంపిన ఆమె తల్లికి జ్యోతికి కింగ్‌ నాగార్జున థ్యాంక్స్‌ చెప్పారు. ఆమె లాంటి తల్లి దొరికినందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలివని పొగిడేశారు. ఇలా అందరూ తమ పిల్లల్ని ఎంకరేజ్‌ చేయాలని కూడా అన్నారు. హారిక మేనరిజమ్‌ను నాగ్‌ స్టేజీ మీద చేయడం షోలో హైలైట్‌గా నిలిచింది. ‘బిగ్‌బాస్‌’ మీద గతంలో చేసిన వీడియోను కూడా నాగ్‌తో హారిక చెప్పడం, ఆయన బాగుందని చెప్పడం కూడా మీరు చూసే ఉంటారు.

అందుకే హాట్‌ ఫేవరేట్‌

తెలంగాణ యాసతో ఇప్పటికే యూట్యూబ్‌లో దడదడలాడిస్తున్న హారిక… బిగ్‌బాస్‌ హౌస్‌లోనూ కీ పార్టిసిపెంట్‌ అనడంలో అతిశయోక్తి లేదు. యూత్‌లో ఆమెకున్న ఫాలోయింగే దానికి కారణం. యూట్యూబ్‌లో ఆమెకున్న ఫాలోయింగ్‌ లెక్కలు ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం. ఇక షోలో ఎలా ఉంటుందో ‘డాన్‌ బాస్కో…’ అంటూ బోల్డ్‌ అండ్‌ హాట్‌ పర్‌ఫార్మెన్స్‌తో చూపించింది. ఆ క్యూట్‌నెస్‌ ఎవరైనా ఓటేయాల్సిందే అంటూ అప్పుడే మీమ్స్‌ కూడా హల్‌చల్‌ చేస్తున్నాయి. ప్లాన్‌ చేసుకొని జీవిస్తే… నిరాశ తప్పదు అనుకునే హారిక… మరి బిగ్‌బాస్‌లో ప్లాన్‌ ప్రకారం ముందుకెళ్తుందా? లేక స్పాంటేనియస్‌గా ఉంటుందా చూడాలి. ఇక హారిక ఇంట్లో ఎలా ఉంటుందో చాలా వీడియోల్లో చూసేశారు. మరి పెద్ద ఇంట్లో ఎలా ఉంటుందో ఈ రోజు నుంచి స్టార్‌ మాలో చూసేయండి.

అన్నట్లు హారిక గురించి తెలుసుగా డిగ్రీ చదువుకొంటుండగానే.. యూట్యూబర్‌గా అనుకోకుండా మంచి అవకాశాన్ని ఒడిసిపట్టుకుంది. ‘దేత్తడి’, ‘చిత్ర విచిత్రం’ అనే సిరిస్‌లు బాగా పాపులర్ అయ్యాయి కూడా. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత యూట్యూబ్‌లో కొద్ది రోజుల్లోనే హిట్ కావడంతో అదే ప్రొఫెషన్‌‌గా ఎంచుకుంది.

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus