Devara: దేవర మూవీ ఆడియో రైట్స్ కోసం ఏకంగా అంత ఖర్చు చేశారా?

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో అనిరుధ్ మ్యూజిక్, బీజీఎం అందించిన సినిమాలు భాషతో సంబంధం లేకుండా సత్తా చాటుతున్నాయి. దేవర మూవీ ఆడియో రైట్స్ కోసం ప్రముఖ సంస్థ ఏకంగా 27 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని సమాచారం అందుతోంది. ప్రముఖ సంస్థ ఈ హక్కులను కొనుగోలు చేసిందని సమాచారం అందుతోంది.

పుష్ప2 మూవీ ఆడియో రైట్స్ 45 కోట్ల రూపాయలకు అమ్ముడవగా ఆ స్థాయిలో కాకపోయినా దేవర సినిమా హక్కులు మంచి రేటుకే అమ్ముడయ్యాయని చెప్పాలి. దేవర సినిమా రిలీజ్ డేట్ మారదని ఇతర సినిమాలలా ఈ సినిమా డేట్ ను మార్చే అవకాశం లేదని మేకర్స్ పదేపదే చెబుతున్నారు. దేవర మూవీ షూటింగ్ ఇప్పటికే 75 శాతం పూర్తైందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

దేవర (Devara) సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ భయానికే భయం పుట్టించే పాత్రలో కనిపించనున్నారు. 2024 సంవత్సరం జనవరి నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుకానున్నాయని తెలుస్తోంది. జాన్వీ కపూర్ పల్లెటూరి అమ్మాయి పాత్రతో ప్రేక్షకులను మెప్పించనున్నారని తంగం పాత్ర జాన్వీ కెరీర్ లోని స్పెషల్ రోల్స్ లో ఒకటిగా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

భైరా పాత్రకు సంజయ్ దత్ ప్రాణం పోశారని ఆయన పర్ఫామెన్స్ వేరే లెవెల్ లో ఉందని సమాచారం అందుతోంది. దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా సముద్రతీరం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండటం ఈ సినిమాకు ప్లస్ అయింది. దేవర సినిమా రిలీజ్ తర్వాత ఏ రేంజ్ లో రికార్డులు సాధిస్తుందో చూడాలి. ఎన్టీఆర్ కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలిచిపోనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లానింగ్ మాత్రం సూపర్ గా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus