ఎన్టీఆర్ (Jr NTR) , దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత తెరకెక్కిన చిత్రం ‘దేవర’ (Devara) . ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ సమర్పణలో ‘యువ సుధా ఆర్ట్స్’ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ (Sudhakar Mikkilineni) ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన పాటలు, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి. సెప్టెంబర్ 27న ‘దేవర'(మొదటి భాగం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
దీంతో థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 45.00 cr |
సీడెడ్ | 22.00 cr |
ఉత్తరాంధ్ర | 12.20 cr |
ఈస్ట్ | 8.00 cr |
వెస్ట్ | 6.00 cr |
గుంటూరు | 8.20 cr |
కృష్ణా | 7.00 cr |
నెల్లూరు | 4.00 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 112.40 cr |
కర్ణాటక | 14.50 cr |
తమిళనాడు | 6.00 cr |
కేరళ | 0.50 cr |
నార్త్ | 15.00 cr |
ఓవర్సీస్ | 26.00 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 174.40 cr (షేర్) |
‘దేవర’ చిత్రానికి రూ.174.4 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.175 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ అయితే చాలా పెద్దది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప.. బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా కష్టం.