Jr NTR: ‘దేవర’ తెలుగు ప్రచారం ఫినిష్‌.. ఇక అంతా కొరటాల చేతిలోనే..!

సినిమాల ప్రచారం కోసం టీమ్స్‌ కొన్ని ప్లాన్స్‌ వేసుకుంటాయి. ఇప్పుడిది, అప్పుడది అంటూ ఈవెంట్ల లెక్క వేసుకుంటారు. అందులో ఏ ఒక్కటి తేడా కొట్టినా మళ్లీ జరగడం కష్టమే. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న సినిమా ‘దేవర’. తారక్‌  (Jr NTR)  – కొరటాల శివ  (Koratala Siva)  కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా ప్రచారాన్ని తారక్‌ 22న సాయంత్రం జరిగే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌తో ముగిస్తారు అని టీమ్‌ అనుకుంది. కట్‌ చేస్తే ఈవెంట్‌ జరగలేదు. దీంతో ఇక తెలుగు ‘దేవర’ (Devara) ప్రచారం లేనట్లే అంటున్నారు.

Jr NTR

వివిధ కారణాల వల్ల ‘దేవర’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రద్దు కావడంతో అభిమానులు బాధలో ఉన్నారు. మళ్లీ ఇంకేదో ఈవెంటో, ప్రెస్‌ మీటో పెడతారులే అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం అయితే ఇక తెలుగు ప్రచారం లేనట్లే అని చెబుతున్నారు. ఎందుకంటే తారక్‌ అమెరికా వెళ్లిపోయాడు కాబట్టి. ‘దేవర’ సినిమా కోసం దాదపు నెల రోజుల నుండి ప్రచార కార్యక్రమాల్లో తారక్‌ బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ముందుగా ప్లాన్‌ చేసుకున్న ప్రకారం అమెరికా వెళ్లిపోయాడు.

ఆదివారం రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి అమెరికా బయలు దేరారు. మళ్లీ సెప్టెంబర్ 28 తర్వాతే హైదరాబాద్‌ వస్తారట. సెప్టెంబర్ 26న అమెరికాలోని లాస్ ఏంజిలెస్‌లో బియాండ్ ఫెస్ట్ అనే ఈవెంట్‌ ఉంది. దీనికి ఎన్టీఆర్ హాజరు అవుతున్నాడు. అలాగే అక్కడ ‘దేవర’ స్పెషల్ ప్రీమియర్ షో ఉంది. దీంతోపాటు హాలీవుడ్ మీడియా సంస్థలు ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. ఆ లెక్కన తెలుగు ప్రచారం ఇక ముగిసినట్లే.

ఈ లెక్కన ప్రచారం మొత్తం కొరటాల శివ చేతుల్లో ఉంది అని అంటున్నారు. ఎందుకంటే జాన్వీ  (Janhvi Kapoor) కూడా ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు అని చెబుతున్నారు. మరి టీమ్‌ ఎలాంటి ప్లాన్స్‌ చేస్తుందో చూడాలి. సినిమా రిలీజ్‌కు ముందు తారక్‌తో ఓ వీడియో బైట్‌ రెడీ చేసే అవకాశం ఉంది.

దేవర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus