సంక్రాంతి పండుగ కానుకగా మొత్తం 5 సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈగల్ సినిమా సంక్రాంతి పోటీ నుంచి తప్పుకోగా తమిళ మూవీ అయలాన్ సంక్రాంతి రేసులో నిలవడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఇప్పటికే సంక్రాంతికి ఫిక్స్ అయిన సినిమాలు థియేటర్లను బుక్ చేసుకున్నాయి. ఈ నెల 11వ తేదీ సాయంత్రం నుంచి హనుమాన్ షోలు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శితం కానున్నాయి. థియేటర్ల సమస్య వల్ల హనుమాన్ ను 12వ తేదీ చూడాలని భావించే వాళ్లకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఒకరోజు ముందుగానే ఈ సినిమాను చూసే అవకాశాన్ని మేకర్స్ కల్పిస్తున్నారు.
అయితే హనుమాన్ మూవీ ప్రదర్శించబడే థియేటర్లలో (Devara) దేవర గ్లింప్స్ కూడా ప్రదర్శిస్తారని తెలుస్తోంది. ఆ విధంగా హనుమాన్ మూవీకి దేవర అండగా నిలుస్తున్నాడని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. హనుమాన్ సినిమా రిలీజ్ సందర్భంగా తేజ సజ్జా బాల నటుడిగా నటించిన సినిమాలకు సంబంధించిన క్లిప్స్ సైతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. హనుమాన్ మూవీ కోసం ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.
హనుమాన్ కు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమాకు థియేటర్ల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంటుంది. హనుమాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి రావడం ఈ సినిమాకు మరింత ప్లస్ అయింది. హనుమాన్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సంక్రాంతి పండుగకు సినీ అభిమానులు రెండు నుంచి మూడు సినిమాలు చూసే ఛాన్స్ ఉండగా గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు ఫస్ట్ ఛాయిస్ గా ఉన్నాయి. సంక్రాంతి సినిమాలన్నీ బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సంక్రాంతి పండుగకు రిలీజ్ కానున్న సినిమాలకు టార్గెట్లు సైతం భారీగానే ఉన్నాయి.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!